ఆయిల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం


మెదక్ : మూసి ఉన్న ఆయిల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటన మెదక్ జిల్లా వడియారంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సమయానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా ఈ ప్రమాదంలో ఎంత ఆస్తి నష్టం వాటిల్లిందనే విషయం ఇంకా తెలియరాలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top