
శంషాబాద్ : లారీ బ్యాటరీ వ్యర్థాల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్‌లోని గగన్‌పహాడ్‌లో మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీ బయట ఆగి ఉన్న నాలుగు లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు రూ.45 లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగింది. షార్ట్ షర్క్యుట్ వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని సమాచారం. ఫైరింజన్లు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి.