కరీంనగర్ జెడ్పీ సమావేశం రసాభాస | Fight meeting in Karimnagar | Sakshi
Sakshi News home page

కరీంనగర్ జెడ్పీ సమావేశం రసాభాస

Dec 12 2016 2:37 AM | Updated on Sep 19 2019 8:44 PM

కరీంనగర్ జెడ్పీ సమావేశం రసాభాస - Sakshi

కరీంనగర్ జెడ్పీ సమావేశం రసాభాస

స్థానిక సంస్థలకు నిధులు, విధులు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ జెడ్పీటీ సీ, ఎంపీపీ సభ్యులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది

నిధులు, విధుల కోసం కాంగ్రెస్ జెడ్పీటీసీల ఆందోళన
భిక్షాటన, బైఠారుుంపు జెడ్పీటీసీల అరెస్ట్, సస్పెన్షన్

 
 కరీంనగర్: స్థానిక సంస్థలకు నిధులు, విధులు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ జెడ్పీటీ సీ, ఎంపీపీ సభ్యులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆదివారం నిర్వహించిన జెడ్పీ సర్వసభ్య సమావేశానికి ముందు ప్రభు త్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ జెడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు చల్లా నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రతిమ మల్టీప్లెక్స్ హోటల్ ఎదుట భిక్షాటన చేశారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరుగుతున్న జెడ్పీ సర్వసభ్య సమావేశానికి వచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ పోడియం ఎదుట బైఠారుుంచారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ, మరో వైపు అధికార పార్టీ సభ్యుల నినాదాలతో సభ హోరెత్తింది.

ఈ దశలో జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కరీంనగర్, మంథని ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు జోక్యం చేసుకుని సభకు అంతరాయం కలిగించొద్దని, సభ నడిచేలా సహకరించాలని కోరారు. నిధుల వ్యవహారంపై ఏదో ఒకటి తేల్చాలని పట్టుబట్టడంతో గందరగోళం నెలకొంది. మరోసారి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా కాంగ్రెస్ జెడ్పీటీసీలు పోడియం ముందు నుంచి లేచేది లేదని పట్టుబట్టారు. దాదాపు ఇరవై నిమిషాలపాటు గందరగోళం నెలకొనడంతో..సభకు అంతరాయం కలిగిస్తున్న కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు జెడ్పీ చైర్‌పర్సన్ ప్రకటించారు. అరుునా ఆందోళన కొనసాగించడంతో పోలీసులు వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

 అరెస్టులు అప్రజాస్వామికం..డీసీసీ చీఫ్ కటకం, మాజీ ఎంపీ పొన్నం
 స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ జెడ్పీ సర్వసభ్య సమావేశంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ జెడ్పీటీసీలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గందె మాధవి వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. స్థానిక సంస్థల ప్రతినిధులపై పోలీసుల జులుం అమానుషమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ, ఎంపీపీలను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, విపక్షనేత జానారెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. జెడ్పీ నిధులు, విధులపై త్వరలో నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement