ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్ | Field assistant suspended | Sakshi
Sakshi News home page

ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్

Feb 29 2016 4:36 PM | Updated on Sep 3 2017 6:42 PM

నర్సరీ నిర్వహణ సరిగా లేదనీ ఫీల్డ్ అసిస్టెంట్‌ను డ్వామా పీడీ సస్పెండ్ చేశారు.

నర్సరీ నిర్వహణ సరిగా లేదనీ ఫీల్డ్ అసిస్టెంట్‌ను డ్వామా పీడీ సస్పెండ్ చేశారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నర్మెట్ట మండలం అబ్దుల్‌నాగారం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ గత కొంతకాలంగా విధుల్ని సక్రమంగా నిర్వర్తించడం లేదు.

ఈ నేపథ్యంలో పీడీ రాజశేఖర్ నర్సరీని సోమవారం తనిఖీ చేయగా పలు లోపాలు బయటపడ్డాయి. శ్రీనివాస్ పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన పీడీ అతన్ని సస్పెండ్ చేశారు. నర్సరీలో పర్యవేక్షణ లోపం ఉందనీ టె క్నికల్ అసిస్టెంట్ రంజిత్‌కుమార్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement