క్షణికావేశంలో కన్న తండ్రినే చంపేశాడు | father was killed by sun in nalgonda district | Sakshi
Sakshi News home page

క్షణికావేశంలో కన్న తండ్రినే చంపేశాడు

Oct 4 2015 4:39 PM | Updated on Jul 29 2019 5:43 PM

క్షణికావేశంలో కన్న తండ్రినే కొడుకు కిరాతకంగా హత్య చేశాడు.

పెద్దఅడిశెలపల్లి (నల్లగొండ): క్షణికావేశంలో కన్న తండ్రినే కొడుకు కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా వద్దిపల్లి గ్రామం మజరా పడమటి తాండాలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. రామావత్ హనుమ భార్యను కొడుతుండగా హనుమ తండ్రి రామావత్ తాంత్రియా అడ్డువెళ్లాడు. ఆవేంశంలో ఉన్న హనుమ తండ్రిపై కత్తితో దాడిచేసి పొడవడంతో తాంత్రియా తీవ్రంగా గాయపడ్డాడు.

వెంటనే అతణ్ణి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ గొడవలో రామావత్ హనుమ భార్య కూడా తీవ్రంగా గాయపడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదుమేరకు పెద్దఅడిశెపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement