అన్నదమ్ముల మధ్య చెలరేగిన ఆస్తి తగాదాలతో మనస్తాపానికి గురైన వ్యక్తి తన పిల్లలకు విషం ఇచ్చి తను కూడా తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఘట్‌కేసర్ (రంగారెడ్డి) : అన్నదమ్ముల మధ్య చెలరేగిన ఆస్తి తగాదాలతో మనస్తాపానికి గురైన వ్యక్తి తన పిల్లలకు విషం ఇచ్చి తను కూడా తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం అవుశాపూర్ గ్రామంలో సోమవారం వెలుగు చూసింది.
స్థానికంగా హోటల్ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్న కృష్ణా రెడ్డి(45).. సోదరులతో గత కొన్ని రోజులుగా ఆస్తి విషయంలో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురై పదేళ్ల లోపు ఉన్న ఇద్దరు పిల్లలకు పురుగుల మందు ఇచ్చి, తను కూడా తాగి మృతిచెందాడు. సమాచారం అందుకున్న బీబీ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.