పిల్లల గొంతు కోసి.. తానూ కోసుకున్న తండ్రి | father attempts suicide with two childrens in mahabubnagar district | Sakshi
Sakshi News home page

పిల్లల గొంతు కోసి.. తానూ కోసుకున్న తండ్రి

Feb 7 2016 5:06 AM | Updated on Jul 27 2018 2:18 PM

పిల్లల గొంతు కోసి.. తానూ కోసుకున్న తండ్రి - Sakshi

పిల్లల గొంతు కోసి.. తానూ కోసుకున్న తండ్రి

భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో ఓ తండ్రి ఇద్దరు పిల్లల గొంతు కోసి తానూ గొంతు కోసుకున్నాడు.

మహబూబ్‌నగర్ క్రైం: భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో ఓ తండ్రి ఇద్దరు పిల్లల గొంతు కోసి తానూ గొంతు కోసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో శనివారం జరిగింది. ప్రస్తుతం ఈ ముగ్గురు జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన సుభాష్, షాద్‌నగర్‌కు చెందిన మంజుల కొన్నేళ్ల కిందట ప్రేమవివాహం చేసుకున్నారు. వారికి ఐదు, రెండేళ్ల ఇద్దరు పిల్లలున్నారు.

కొంతకాలంగా భూత్పూర్ పంచాయతీ పరిధిలోని షేర్‌పల్లి(బీ)లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. సుభాష్ స్థానిక ఓ కంపెనీలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. ఏమైందో ఏమోగానీ.. వారం రోజుల క్రితం భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో పిల్లలు అమ్మ కావాలని రోజూ ఏడుస్తున్నారు. భార్య రాకపోవడం, పిల్లల బాధ చూడలేకపోయిన సుభాష్.. శనివారం సాయంత్రం ఇంట్లో బ్లేడ్‌తో ఇద్దరు పిల్లలు కిర్తీ(5), రుషిరాము (2) గొంతు కోసి తనూ గొంతు కోసుకున్నాడు. ఇరుగుపొరుగు గమనించి వెంటనే 108 వాహనంలో మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ముగ్గురూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement