కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని వ్యవసాయ మార్కెట్‌లో వరుసగా మూడో రోజు కొనుగోళ్లు నిలిచి పోయాయి.
జమ్మికుంట మార్కెట్‌లో ఆందోళన
Mar 2 2016 11:45 AM | Updated on Jun 4 2019 5:16 PM
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని వ్యవసాయ మార్కెట్‌లో వరుసగా మూడో రోజు కొనుగోళ్లు నిలిచి పోయాయి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ దడ్వాయిలు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరుకోవడంతో.. మార్కెట్‌లో పత్తి నిల్వలు పేరుకుపోయాయి. దీంతో ఆగ్రహించిన రైతులు తమ ఆవేదన పట్టించుకోరా అంటూ తహశీల్దార్‌ను నిలదీశారు. ఓ వైపు దడ్వాయిల సమ్మెకు తోడు మరో వైపు రైతులు ఆందోళనకు దిగడంతో మార్కెట్ వాతావరణం వేడెక్కింది. మార్కెట్ ఎదుట ప్రస్తుతం పత్తిలోడుతో ఉన్న 500 వాహనాలు నిలిచి ఉండటంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
Advertisement
Advertisement