ఆర్డీవో ఘెరావ్ | farmers attacks on RDO | Sakshi
Sakshi News home page

ఆర్డీవో ఘెరావ్

Apr 15 2015 5:29 PM | Updated on Oct 1 2018 2:00 PM

అకాల వర్షాలకు పంటలను నష్టపోయిన రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

సూర్యాపేట: అకాల వర్షాలకు పంటలను నష్టపోయిన రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలో ఆర్డీవో శ్రీనివాసరెడ్డిని కార్యాలయంలోకి వెళ్లనీయకుండా రైతులు బుధవారం అడ్డుకున్నారు. వర్షాలకు పంటలు దెబ్బతిని రెండు రోజులు దాటిపోతున్నా పంట నష్టంపై పరిశీలన జరిపి ప్రభుత్వానికి నివేదిక పంపకపోవడంపై రైతులు ఆర్డీవో శ్రీనివాసరెడ్డిని నిలదీశారు. దీంతో పంట నష్టంపై తక్షణమే పరిశీలన చేయించి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని బాధిత రైతులకు ఆర్డీవో హామీ ఇచ్చినట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement