లాభదాయకమా కాదా? | Explanation the appointment of the gutta | Sakshi
Sakshi News home page

లాభదాయకమా కాదా?

Apr 11 2018 2:33 AM | Updated on Apr 11 2018 2:33 AM

Explanation the appointment of the gutta - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన గుత్తా సుఖేందర్‌రెడ్డి నియామకం చెల్లుతుందా అనే విషయం చర్చనీయాంశమైంది. నల్లగొండ ఎంపీగా ఉన్న గుత్తాకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఈ బాధ్యతలను అప్పగించింది. ఎంపీ పదవిలో ఉన్న గుత్తా లాభదాయకమైన మరో పదవిలో ఎలా కొనసాగుతారంటూ రాష్ట్ర బీజేపీ నేతలు ఇటీవలే లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

దీంతో ఆ వివరాలు పంపాలని లోక్‌సభ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరినట్లు సమాచారం. ఈ మేరకు సీఎస్‌కు  లేఖ రాసినట్లు తెలిసింది.  దీనిపై లోక్‌సభకు సమాధానం పంపించేందుకు అధికారులు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబం ధించి లోక్‌సభకు ఉత్తర ప్రత్యుత్తరాల బాధ్యతలను సీనియర్‌ ఐఏఎస్, ప్రధాన కార్యదర్శి శాలిని మిశ్రాకు సీఎస్‌ ఎస్‌కే జోషి అప్పగించినట్లు తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement