పది రోజుల్లో ఫిక్స్‌!

Exercise on engineering fees - Sakshi

ఇంజనీరింగ్‌ ఫీజులపై కసరత్తు 

వేగవంతం చేసిన ఏఎఫ్‌ఆర్‌సీ 

3 రోజుల్లో కోర్టుకు వెళ్లిన కాలేజీల ఫీజులు 

ఆ తర్వాత మిగతా కాలేజీ ఫీజుల ఖరారుకు చర్యలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల ఖరారుకు ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) చర్యలు వేగవంతం చేసింది. 10 రోజుల్లోగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజును ఖరా రు చేసేందుకు చర్యలు చేపట్టింది. కోర్టు ఆదేశాల మేరకు యాజమాన్య ప్రతిపాదిత ఫీజును అమలు చేయకుండా, ఫీజులను ఖరారు చేశాకే కౌన్సెలింగ్‌ను కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా కోర్టును ఆశ్రయించిన 81 కాలేజీల ఫీజుల ను 3 రోజుల్లో ఖరారు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. సోమవారం 20 కాలేజీల ఫీజులను ఖరా రు చేసేందుకు యాజమాన్యాలతో హియరింగ్‌ నిర్వ హించింది. యాజమాన్యాలు ఇచ్చిన గత రెండేళ్ల ఆదాయ వ్యయాలు, తాజా ప్రతిపాదనలను ఏఎఫ్‌ఆర్‌సీ పరిశీలించింది. ఇప్పటికే ఆడిటర్లు ఆ కాలేజీల ఆదాయ వ్యయాలను సమీక్షించిన నేపథ్యంలో సోమ వారం ఏఎఫ్‌ఆర్‌సీ సమావేశమై వాటన్నింటినీ పరిశీలించి ఫీజులను ప్రాథమికంగా నిర్ణయించింది.

మంగళవారం మరో 30 కాలేజీల ఫీజులను ఖరారు చేసేందుకు యాజమాన్యాలతో హియరింగ్‌ నిర్వహించనుంది. బుధవారం మరో 31 కాలేజీల ఫీజులను కూడా ఖరారు చేయనుంది. కోర్టును ఆశ్రయించి యాజమాన్య ప్రతిపాదిత ఫీజు అమలుకు ఉత్తర్వులు పొందిన 81 కాలేజీల ఫీజులను ఖరారు చేయనుంది. దీంతో యాజమాన్య ప్రతిపాదిత ఫీజు కాకుండా, ఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేసే ఫీజుతో ప్రవేశాలను చేపట్టనున్నారు. కోర్టుకు వెళ్లని 108 కాలేజీల ఫీజులను కూడా వచ్చే పది రోజుల్లోగా ఖరారు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ 108 కాలేజీల్లో రూ.50 వేల లోపు వార్షిక ఫీజు ఉన్న కాలేజీలకు 20 శాతం, రూ.50 వేల కంటే ఎక్కువ ఫీజు ఉన్న కాలేజీలకు 15 శాతం ఫీజులను తాత్కాలికంగా పెంచేందుకు ఏఎఫ్‌ఆర్‌సీ యాజమాన్యాలతో సమావేశమై ప్రతిపాదించింది.

వీటికి ఒప్పుకుంటే ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వ హిస్తామని సూచించింది. తర్వాత కాలేజీ వారీగా, ఆదాయ వ్యయాల ఆధారంగా పూర్తి స్థాయి ఫీజును ఖరారు చేస్తామని వెల్లడించింది. ఇందుకు మెజారిటీ యాజమాన్యాలు అంగీకరించాయి. దీనిపై ఏఎఫ్‌ఆర్‌సీ ప్రభుత్వానికి నివేదిక కూడా పంపించింది. ఇప్పుడు తాత్కాలికంగా 15%, 20% ఫీజులను పెం చి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తే విద్యార్థులు ఈ ఫీజుల ప్రకా రమే కాలేజీల్లో చేరుతారు. ఆ తర్వాత పూర్తి స్థాయి ఫీజు ఖరారు చేసినప్పుడు, ప్రస్తుతం ఇచ్చిన 15–20 శాతం పెంపునకు మించి పూర్తిస్థాయి ఫీజులో కాలే జీ ల ఆదాయ వ్యయాల ఆధారంగా పెంపుదల వస్తే గందరగోళం తలెత్తుతుందన్న ఆలోచన ఏఎఫ్‌ఆర్‌సీ వర్గాల్లో వచ్చింది. కాగా, ఇంజనీరింగ్‌ ఫీజుల ఖరారు కోసం ఏఎఫ్‌ఆర్‌సీ చేపట్టిన హియరింగ్‌కు సోమవా రం టాప్‌ కాలేజీల ప్రతినిధులు ఏఎఫ్‌ఆర్‌సీ కార్యాలయానికి వచ్చారు. సోమవారం విచారణకు హాజరైన కొన్ని కాలేజీల యాజమాన్య ప్రతినిధులు మంగళ, బుధవారాల్లో మళ్లీ వస్తామని గడువు కోరారు. 

అప్పీల్‌ కోరితే రూ. లక్ష 
వాసవి, శ్రీనిధి కాలేజీల ఫీజులపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. ఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేసిన ఫీజులను సవాల్‌ చేస్తూ అప్పీల్‌కు వెళ్లే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేసిన ఫీజులను రివ్యూ చేయాలంటే మళ్లీ ఏఎఫ్‌ఆర్‌సీకే అప్పీల్‌ చేసుకోవాలి. అందుకు రూ.లక్ష అప్పీల్‌ ఫీజుగా ఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయించింది. సోమవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కచ్చితంగా ఉండే కాలేజీలు మాత్రమే అప్పీల్‌కు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top