ఓటరుగా నమోదు చేసుకోండి

Enrol As A Voter - Sakshi

నమోదు, సవరణలకు నెల గడువు

ఆగస్టు 31 వరకు నమోదుకు చాయిస్‌

సెప్టెంబర్‌ 1 నుంచి ఇంటింటి సర్వే

షెడ్యూల్‌ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

సాక్షి, సూర్యాపేట:  ఓటరు గుర్తింపు కార్డు.. ఓటు వేసేందుకు కాదు... పింఛన్‌  మంజూరుకు.. బ్యాంకు ఖాతా తెరిచేందుకు.. వ్యక్తిగత గుర్తింపునకు ఓటరు కార్డే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అంతటి ప్రాధాన్యం కలిగిన ఓటరు కార్డును పొందేందుకు.. అందులో అవసరమైన మారులు, చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది.భారత ఎన్నికల సంఘం ఇందుకోసం ప్రత్యేక షెడ్యూల్‌ జారీ చేసింది.  ఐదు నెలలపాటు కొనసాగనున్న ఈ పక్రియకు యం త్రాంగం సిద్ధమవుతోంది. 

ప్రజాస్వామ్య వ్యవస్థలో 18 ఏళ్లు నిండిన ప్రతీ వ్యక్తి కీలకమైన ఓటుహక్కును కలిగి ఉండాలని ఎన్నికల సంఘం చెబుతోంది. అందుకు ఏటా అర్హుల నుంచి ఓటుహక్కు కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. ప్రతీసారి అక్టోబర్‌లో ఈ ప్రక్రియ ప్రారంభించే ఎన్నికల సంఘం ఈసారి నెల ముందుగానే ఓటరు నమోదు, జాబితాలో మార్పున?కు, చేర్పులకు, సవరణలకు ముందుకు వచ్చింది. ఓటరు జాబితను  పారద్శకంగా పక్కా సమాచారంతో తయారు చేయాలనే సంకల్పంతో ముందస్తుగా షెడ్యూల్‌  జారీ చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 31వరకు,  2020, జనవరి 1తేదీతో 18

ఏళ్లు నిండిన యువతీ యువకులు, ఆపై వయస్సుగలవారు ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఓటరు జాబితాలో ఏమైనా సవరణలు ఉన్నా.. చిరునామాలో మార్పులు, చేర్పులు ఉన్నా.. ఫొటో తప్పు ఉన్నా.. మరే పొరపాటు ఉన్నా సరిదిద్దుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇందుకు  ఎన్నికల సంఘం నెల రోజులు గడువు ఇచ్చింది. అందుబాటులో ఉన్న మాధ్యమాల ద్వారా ఓటరు జాబితాను పరిశీలించుకోవాలని సూచనలు చేసింది.

ఏం చేయాలంటే
 ఓటరు నమోదుకు సమీపంలో బీఎల్‌ఓను సంప్రదించాలి. వీలుకాని పక్షంలో దగ్గర లోని ఈసేవ కేంద్రంలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. స్వయంగా  సందర్శించి ఓటు నమోదు, సవరణ చేసుకోవచ్చును. దరఖాస్తుకు రెండు ఫొటోలు, వయసు ధ్రువీకరణ పత్రం, చదువుకోనివారు ఆధార్‌కార్డు లేదా డ్రైవింగ్‌ లైసెన్స్‌ పత్రం రేషన్‌ కార్డు జిరాక్సు జత చేయాలి. లేదా ఆన్‌లైన్‌ ద్వారా కాని , బీఎల్‌ఓల ద్వారా ఓటు నమోదు, సవరణలు చేసుకోవచ్చు. 

  సెప్టెంబర్‌లో ఇంటింటి సర్వే 
సెప్టెంబర్‌ 1 నుంచి బీఎల్‌ఓలు ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. నెల రోజులపాటు నిర్వహించే ఈ  సర్వేలో ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాల ను తెలుసుకోవడం, ఆ దరఖాస్తు ఆమోదానికి అప్‌లోడ్‌ చేయడం, జాబితాలో ఎవరైనా చనిపోయినవారు గానీ, వలస వెళ్లినవారు ఉంటే గుర్తించి వివరాలు సేకరిస్తారు. 18 ఏళ్లు నిండిన వారున్నా వారి వివరాలను నమోదు చేసుకుంటారు.  సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు తమ పరిధిలోని ఇంటింటీ సర్వే చేయనున్నారు.

1950కి ఫోన్‌ చేస్తే చాలు..
ఓటరు జాబితాలో పేరు ఉందా? లేదా ఉంటే ఎక్కడ ఉంది? తెలుసుకోవడానికి సబంధించిన బూత్‌స్థాయి అధికారిని సంప్రదించాలి. లేదంటే 1950 ఓటరు హెల్ప్‌లైన్‌కి పోన్‌ చేసి తెలుసుకోవచ్చు. కార్యాలయ పనిదినాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు  వివరాలు అడిగి తెలుసుకోవచ్చు.

 షెడ్యూల్‌ ఇదీ...

ఓటరు నమోదు, సవరణలు ఆగస్టు 1 నుంచి 31 వరకు
బీఎల్‌ఓల ఇంటింటి సర్వే  సెప్టెంబర్‌ 1 నుంచి 30 వరకు
ముసాయిదా జాబితా విడుదల   అక్టోబర్‌ 10, 2019
అభ్యంతరాల స్వీకరణ  అక్టోబర్‌15 నుంచి నవంబర్‌30 వరకు
తుది జాబితా ప్రకటన  జనవరి 01, 2020
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top