పీఆర్సీతో ఉద్యోగులకు ఆత్మగౌరవం | employees and self-esteem | Sakshi
Sakshi News home page

పీఆర్సీతో ఉద్యోగులకు ఆత్మగౌరవం

Feb 7 2015 3:00 AM | Updated on Sep 2 2017 8:54 PM

ఉద్యోగులకు గౌరవాన్ని పెంపొందించడానికే తెలంగాణ ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ప్రకటించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.

ముకరంపుర : ఉద్యోగులకు గౌరవాన్ని పెంపొందించడానికే తెలంగాణ ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ప్రకటించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. పీఆర్‌సీ ప్రకటించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతగా తెలంగాణ నాన్‌గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో  శుక్రవారం సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్‌ను సన్మానించారు.
 
 వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థాన అర్చకు లు వేదమంత్రాల మధ్య ఆశీర్వచనాలు అందించారు. మంత్రి మాట్లాడుతూ సమాజ గమనా న్ని నిర్దేశించేది ఉద్యోగులేనని, వారి గౌరవం పెంచి ఆత్మవిశ్వాసంతో పనిచేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కేసీఆర్  ప్రజాక్షేత్రంలో తిరుగుతూ చేయూత కోసం ఆశిస్తున్న వారి ఆవేదనను అర్థం చేసుకుని విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. చెప్పినట్లే ఊహించని రీతిలో 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు ఎంత సం తోష పడ్డారో.. పీఆర్‌సీ ప్రకటనతో అంతే సం తోషంగా ఉన్నారని తెలిపారు.
 
 ప్రభుత్వం, ఉద్యోగులు వేరు కాదని, రక్త సంబంధం కాకపోయినా వర్గ సంబంధంతో తెలంగాణ ప్రజానీకానికి గొప్ప జీవితమివ్వడమే లక్ష్యంగా బాధ్యతగా పనిచేయాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలల పసిగుడ్డు అయినా.. చిచ్చరపిడుగు తెలంగాణగా నిరూపితం చేసుకుంటోందన్నారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాధించి గొప్ప రాష్ట్రంగా అవతరిస్తుందని, రాష్ట్ర పురోగతి, అభివృద్ధిని ఆస్వాదించేలా ఉద్యోగులు పాలన ఉండాలన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మాణానికి అవినీతి లేని పాలన అందించాలని ఉద్యోగులను కోరారు.ట్రెజరీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పవన్‌కుమార్‌తోపాటు ఉద్యోగులు భారీ పూలమాల, మెమెంటోతో సత్కరించారు. టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు ఎం.హమీద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మె ల్సీ నారదాసు లక్ష్మన్‌రావు, నగర మేయర్ సర్దా ర్ రవీందర్‌సింగ్, కార్పొరేటర్లు సునీల్‌రావు, ఆరిఫ్, కంసాల శ్రీనివాస్, తాటిప్రభావతి, నాయకులు నగేశ్ ముదిరాజ్,మైకేల్ శ్రీను, చొప్పరి వేణు, టీఎన్‌జీవో కేంద్ర, జిల్లా, పట్టణ శాఖ నాయకులు గాజుల నర్సయ్య, సుద్దాల రాజయ్య, నర్సింహస్వామి, రాంకిషన్, దారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, లక్ష్మి, శారద, సరిత, హరిచరణ్, శ్రీధర్, హర్మీందర్‌సింగ్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement