వలసలు ఆపుతాం.. ఉపాధి కల్పిస్తాం

 Emigration will stop and we will provide employment - Sakshi

‘పేట’, గద్వాలకు హ్యాండ్‌లూమ్‌ పార్క్‌  

 బీజేపీ ప్రభుత్వం వస్తే ‘పేట’ను జిల్లాగా చేస్తాం  

 మార్పుకోసం బీజేపీ సభలో అమిత్‌ షా

సాక్షి, నారాయణపేట/ నారాయణపేట రూరల్‌:  ఈసా రి ఎన్నికల్లో కమలంపువ్వు గుర్తుకు ఓటేసి అధికారం కట్టబెడితే పాలమూరు జిల్లాలో వలసలు నివారించి, ఉపాధి కల్పిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే సాగు, తాగునీరు లేక వలసపోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు.

ఎన్నికల ప్ర చారంలో భాగంగా ఆదివారం ఆయన నారాయ ణపేట మినీ స్టేడియం గ్రౌండ్‌లో కొత్తకాపు రతంగపాండురెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడారు. ఎంతో చరిత్ర కలిగిన నారాయణపేట, గ ద్వాల చేనేతను ఎవరూ పట్టించుకోవడం లేదన్నా రు. బీజేపీ ప్రభుత్వంలో హ్యాండ్‌లూమ్‌ పార్క్‌ను ఏర్పాటు చేసి కీర్తి పెంచుతామని చెప్పారు.

కృష్ణా – వికారాబాద్‌ రైల్వేలైన్‌ మంజూరై, సర్వే పూర్తిచేసి దశాబ్దాలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వని కారణంగా పెండింగ్‌లోనే ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజల కోరికను తీరుస్తూ నారాయణపేటను జిల్లా చేస్తామని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ హామీలు ఇవ్వడం తప్పా.. ఒక్కటీ పూర్తి చేయలేదని విమర్శించారు. జిల్లా ఆస్పత్రి చేస్తామని చెప్పి కనీసం భూమిపూజ కూడా చేయలేదని ఎద్దేవా చేశారు.  

ఆ రిజర్వేషన్లు సాధ్యం కాదు..  
మతపరమైన రిజర్వేషన్లు సాధ్యంకావని, అందువల్లే బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అమిత్‌షా అన్నారు. కొందరు దీనికి విరుద్ధంగా హామీ ఇచ్చి మోసంచేయడం సరికాదని అన్నారు. అమరవీరుల కుటుంబాలను విస్మరించి ఎలాంటి ఉపాధి చూపలేదన్నారు. ఎంఐఎంకు తలొగ్గి తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించడంలేదని, బీజే పీ ప్రభుత్వం వస్తే ప్రతీ గ్రామంలో అధికారికంగా సెప్టెంబర్‌ 17న పండుగ చేస్తామన్నారు.

దళిత సీ ఎం హామీని విస్మరించిన కేసీఆర్‌ ఏకకాలంలో పా ర్లమెంట్, అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే మోది చరీ ష్మా ముందు గెలవలేమని భావించి తన కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్‌ కోసం ముందస్తుకు వెళ్లాడని, ప్రజాధనం దుర్వినియోగం చేయించాడ ని అన్నారు. రాష్ట్రానికి కాపలా కుక్కలాగా ఉంటానన్న కేసీఆర్, నాలుగున్నర ఏళ్లలో అవినీతి నక్క లా మరాడని విమర్శించారు.

మైనార్టీలకు పెద్దపీ ట వేస్తామన్న కాంగ్రెస్‌ ఉర్దూ టీచర్ల నియామకం చేపడితే తెలుగు ఉపాధ్యాయుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. చర్చి, మసీదులకు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ దేవాలయాలను ఎందుకు విస్మరిస్తుందో చెప్పాలని అన్నారు. బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్‌ మాట్లాడుతూ కుటుంబ పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌కు చరమగీతం పాడి బీజేపీని గెలిపించుకుందామని అన్నారు

. సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, సేడెం ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌పాటిల్, యాద్గిర్‌ జెడ్పీ మాజీ చైర్మన్‌ శరణ్‌భూపాల్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణయాదవ్, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ప్రభాకరవర్ధన్, మహేష్‌శెట్టి, ఎంపీపీ మణెమ్మ, జెడ్పీటీసీ లప్ప అరుణాదేవి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నందునామాజీ, పట్టణ, మండల అధ్యక్షుడు బోయ లక్ష్మణ్, సాయిబన్న, లక్ష్మి, నర్సన్‌గౌడ్, సిద్రామప్ప, నాగిరెడ్డి, గుండప్ప, రామకృష్ణ. అశోక్, బందేష్, శంకరప్ప, రఘువీర్‌యాదవ్‌ పాల్గొన్నారు.  

సేవకుడిలా పనిచేస్తా  
ఆస్తులు కాపాడుకునేందుకు, వ్యాపారాలను అ భివృద్ధి చేసుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చి డబ్బు, మద్యంతో గెలవాలనుకుంటున్న వారికి ఓటుతో బుద్ధిచెప్పాలి. తనను గెలిపిస్తే సేవకుడి లా పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చిన ఓటర్లు ఒ క్కసారి బీజేపీని గెలిపించాలి. పదవుల కోసం పార్టీలు మారే నాయకులను నమ్మవద్దు. 30ఏళ్ల నుంచి ఒకే పార్టీలో సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తున్న తనకు చట్టసభలోకి వెళ్లే అవకాశం కల్పించాలి.  
– రతంగపాండురెడ్డి, నారాయణపేట బీజేపీ అభ్యర్థి  

‘పేట’లో బీజేపీ గెలవడమే నా కల  
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి బ్రహ్మరథం పడుతున్న నారాయణపేట నియోజకవర్గ ప్రజలు ఈసారి అసెంబ్లీకి బీజేపీ అభ్యర్థిని పంపిస్తే నా కల తీరుతుంది. బీజేపీ సత్తాచూపి ఒక్కో కార్యకర్త 10ఓట్లు వేయించాలి. జిల్లా కోసం ఎస్‌ఆర్‌రెడ్డి రాజీనామా చేస్తే పట్టించుకోని కేసీఆర్, ఇప్పుడు గెలిపిస్తే జిల్లా ఇస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. బీజేపీ గెలిస్తే జిల్లాతో పాటు ‘పేట’ – కొడంగల్‌ ఎత్తిపోతల పథకం పూర్తి అవుతుంది. హిందూసమాజం పట్ల అసభ్యంగా మాట్లాడుతున్న ఓవైసీకి భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు తలుచుకుంటే తగిన బుద్ధిచెప్తారు.  
– నాగురావు నామాజీ, కొడంగల్‌ బీజేపీ అభ్యర్థి   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top