
సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా నగరంలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోయాయి. నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు (ఎన్ఎంసీ)కు వ్యతిరేకంగా జూడాలు దేశ వ్యాప్తంగా సమ్మె చేపట్టారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) పిలుపు మేరకు గురువారం వైద్య సేవలు నిలిపివేశారు. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్ ఆసుపత్రులతో పాటు వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా సేవలు నిలిపివేస్తున్నట్లు జూడాలు పేర్కొన్నారు. గాంధీ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.