పరిగి: విద్యుదాఘాతంతో ఓ ఉపసర్పంచ్ మృతి చెందారు. ఈ సంఘటన మండల పరిధిలోని పేటమాదారంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
పరిగి: విద్యుదాఘాతంతో ఓ ఉపసర్పంచ్ మృతి చెందారు. ఈ సంఘటన మండల పరిధిలోని పేటమాదారంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబీకుల కథనం ప్రకారం... గ్రామంలో కొంతకాలంగా విద్యుత్ సమస్య నెలకొంది. గ్రామస్తులు పలుమార్లు విద్యుత్ అధికారులు విషయం తెలియజేసినా సమస్య పూర్తిగా పరిష్కరించలేదు. దీంతో గ్రామస్తులే ట్రాన్స్‌ఫార్మర్ నుంచి ైడె రెక్ట్ కనెక్షన్ ఇచ్చుకున్నారు.
ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో గ్రామస్తులు ఉపసర్పంచ్ గూడూరు రాంచంద్రయ్య(38) వద్దకు వెళ్లి నిలదీశారు. దీంతో అతను ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో వెళ్లాడు. బాగు చేసేందుకు ప్రయత్నిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అలాగే పట్టుకుంది. గ్రామస్తులు కర్రలతో కొట్టి విడిపించారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో గ్రామస్తులు, కుటుంబీకులు పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు రామచంద్రయ్య అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య మల్లమ్మ, కూతురు నితీష(15) కుమారుడు బాలు(10) ఉన్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి యాదయ్య, సీపీఎం డివిజన్ కార్యదర్శి వెంకటయ్యలు సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబీకులను పరామర్శించారు.