ఎన్నికల సిత్రాలు | Election Candidates Campaign Different Ways | Sakshi
Sakshi News home page

ఎన్నికల సిత్రాలు

Nov 27 2018 1:06 PM | Updated on Nov 27 2018 2:00 PM

మీ శ్రమలో తోడై.. 

వికారాబాద్‌ జిల్లా దోమ మండల పరిధిలోని పలు
 గ్రామాల్లో సోమవారం బీజేపీ పరిగి అభ్యర్థి ప్రహ్లాద్‌రావు రోడ్‌షో, ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు తమ పనుల్లో నిమగ్నమైన ఉండగా వారికి సహకరించారు. తనను గెలిపిస్తే ఎల్లప్పుడు అందుబాటులో ఉండి సేవ చేస్తానని చెప్పారు.  
– దోమ: 

     

 బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో..
   కారు గుర్తుకు ఓటెయ్యాలో..
 

మహేశ్వరం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి సోమవారం మండల పరిధిలో ముమ్మర ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పులిమక్త గ్రామంలో ఆయన బతుకమ్మ ఎత్తుకున్నారు. కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు.  

కటింగ్‌ చేస్తా.. ఓట్లు రాబడుతా.. 


ధారూరు మండల పరిధిలో సోమవారం వికారాబాద్‌ స్వతంత్ర అభ్యర్థి చంద్రశేఖర్‌ అనుచరులు విస్తృతంగా ప్రచారం చేశారు. సింహం గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా ఓ హెయిర్‌ సెలూన్‌లో గడ్డం గీస్తూ వినూత్నంగా ప్రచారం చేశారు.  
– ధారూరు   

Advertisement
 
Advertisement
Advertisement