రేపటి నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ | edcet counselling starts | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్

Sep 20 2014 3:49 AM | Updated on Sep 2 2017 1:39 PM

బీఎడ్‌లో చేరే విద్యార్థుల కోసం ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానుంది.

ఖమ్మం, కొత్తగూడెంలో కేంద్రాలు

ఖమ్మం: బీఎడ్‌లో చేరే విద్యార్థుల కోసం ఎడ్‌సెట్ కౌన్సెలింగ్  ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కొత్తగూడెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని క్యాంప్ ఆఫీసర్, ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సుధాకర్, కోఆర్డినేటర్ సుదర్శన్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పీహెచ్, ఎన్‌సీసీ, సీఏపీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు హైదరాబాద్, వరంగల్‌ల్లోని నిర్దేశిత కేంద్రాల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. కొత్తగూడెం, ఖమ్మం కేంద్రాల్లో కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజనల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల అటెస్టెడ్ జిరాక్స్‌లను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని తెలిపారు. ఎడ్‌సెట్ హాల్‌టికెట్, ర్యాంక్‌కార్డు, డిగ్రీ, ఇంటర్మీడియెట్, టెన్త్ క్లాస్ మెమోలు, స్టడీ సర్టిఫికెట్‌లు, కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, డిగ్రీ టీసీ వెంట తీసుకురావాల్సిందిగా వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement