
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యథేచ్చగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్నారు వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్‌రెడ్డి. ప్రభుత్వాన్ని కోర్టులు చీవాట్లు పెట్టినా ధోరణిలో మార్పు రావడం లేదన్నారు. ఈరోజు(మంగళవారం, సెప్టెంబర్ 30వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ అధికారం చేతిలో ఉందని తప్పుడు కేసులు పెడితే సహించేది లేదు. కోర్టుల దృష్టికి తీసుకెళ్తాం. పోలీసులు తమ పరిధి దాటి వ్యవహరిస్తే చర్యలు తప్పవు.
రూల్స్‌ని అతిక్రమిస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవు. పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. సవీంద్ర కేసులో ఆయన భార్య ఫిర్యాదు చేస్తే కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. కోర్టు ఆదేశాలను కూడా పోలీసులు ఉల్లంఘించారు. అధికార పార్టీ నేతల చేతిల్లో కొందరు పోలీసులు కీలు బొమ్మలా మారారు. అధికారం శాశ్వతం కాదని పోలీసులు గుర్తిస్తే మంచిది. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పోలీసులే న్యాయ నిర్ణేత లుగా మారి, తీర్పులు ఇవ్వటం మానుకోవాలి’ అని హెచ్చరించారు.