
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ రావత్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, బీజేపీ, సీపీఐ, సీపీఐ (ఎం), నేషనల్ కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ఆయా పార్టీల ప్రతినిధులకు రావత్ సూచించారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం విపరీతంగా ఉందని బీఎస్పీ ప్రతినిధులు కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్‌కు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం పార్టీ ప్రతినిధుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటోంది.