కరీంనగర్ జిల్లాలో ఈ- గ్రామపంచాయతీలు: కేటీఆర్ | e-Panchayats to set up in Karimnagar District | Sakshi
Sakshi News home page

కరీంనగర్ జిల్లాలో ఈ- గ్రామపంచాయతీలు: కేటీఆర్

Jun 18 2014 6:24 PM | Updated on Sep 2 2017 9:00 AM

కరీంనగర్ జిల్లాలో ఈ- గ్రామపంచాయతీలు: కేటీఆర్

కరీంనగర్ జిల్లాలో ఈ- గ్రామపంచాయతీలు: కేటీఆర్

కరీంనగర్ జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీని ఈ- గ్రామపంచాయతీగా ఏర్పాటు చేస్తామని కేటీఆర్ హామీయిచ్చారు.

సిరిసిల్ల (కరీంనగర్ జిల్లా): ఇరాక్‌లో ఉన్న తెలంగాణవారిని క్షేమంగా తీసుకొస్తామని ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) తెలిపారు. జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీని ఈ- గ్రామపంచాయతీగా ఏర్పాటు చేస్తామని హామీయిచ్చారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశిస్తున్నట్టు చెప్పారు.

సిరిసిల్లను పంచాయతీరాజ్ కేంద్రంగా మార్చాలని అధికారులకు సూచించామన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి శాశ్వత మంచినీటి పథకం ద్వారా నిరంతరాయంగా తాగునీరు అందించేందుకు కృషిచేస్తామని కేటీఆర్ వాగ్దానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement