గోవులతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం సోమవారం సాయంత్రం బోల్తా కొట్టింది.
హైదరాబాద్ : గోవులతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం సోమవారం సాయంత్రం బోల్తా కొట్టింది. ఈ సంఘటన హయత్‌నగర్ మండలం పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు 13 గోవులకు తీవ్రగాయాలయ్యాయి.
గోవులను వెటర్నరీ ఆసుపత్రికి, డ్రైవర్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మోతాదుకు మించి గోవులను ఎక్కించుకోవడం వల్ల మూగజీవాలకు తీవ్రంగా దెబ్బలు తగిలాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.