
సిద్దిపేటజోన్: హరితహారం స్ఫూర్తితో ఆ కుటుంబం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. పెళ్లికి వచ్చిన అతిథులకు మొక్కలను బహూకరించి ఆదర్శంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేటలో శుక్రవారం గాంధీనగర్‌కు చెందిన శైలజ, రామసుబ్బారావుల ద్వితీయ పుత్రిక సుమన వివాహ వేడుక జరిగింది.
ఈ సందర్భంగా పెళ్లికి వచ్చిన అతిథులకు వివిధ రకాల పండ్ల మొక్కలను బహుమతిగా అందజేశారు. ఈ వివాహానికి హాజరైన మాజీ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా కూడా అతిథులకు మొక్కలను అందజేశారు. ఇలా మొక్కలను బహుమతిగా ఇవ్వడం కొత్త ఆలోచన అని, ఇదే స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కొనసాగించాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డితో పాటు టీఆర్‌ఎస్ జిల్లా సమన్వయకర్త రాధాకిషన్‌శర్మ తదితరులు ఉన్నారు.