రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పట్టణంలో ఆత్మహత్యాయత్నం చేసిన ఎస్‌ఏపీ కళాశాల విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పట్టణంలో ఆత్మహత్యాయత్నం చేసిన ఎస్‌ఏపీ కళాశాల విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రాథమిక సమాచారం మేరకు... మహబూబ్‌నగర్ జిల్లా కుందూరు మండలం రేగడి చిల్కమర్రి గ్రామానికి చెందిన భరత్‌రెడ్డి (21) వికారాబాద్‌లోని ఎస్‌ఏపీ కళాశాలలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం స్థానిక బ్లాక్‌గ్రౌండ్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అదే విషయాన్ని స్నేహితులకు ఫోన్ ద్వారా తెలియజేశాడు. దీంతో అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాత్రి అతడి పరిస్థితి విషమంగా ఉండంతో మెరుగైన చికిత్స కోసం మిషన్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం భరత్‌రెడ్డి మృతిచెందాడు. కాగా, ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.