పంట నష్టం అంచనాకు బృందాలు: పార్థసారథి

Crews to predict crop damage - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవలి కుండపోత వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు బృందాలు ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి కలెక్టర్లను ఆదేశించారు. నష్టాన్ని అంచనా వేసి నాలుగైదు రోజుల్లో సమగ్ర నివేదిక పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు శుక్రవారం కలెక్టర్లకు లేఖ రాసినట్లు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. సర్వే నిర్వహించి గ్రామాల వారీగా, పంటల వారీగా నష్టాన్ని అంచనా వేయాలన్నారు. నష్టం జరిగిన చోట్ల ఏయే పంటలకు రైతులు బీమా ప్రీమియం చెల్లించారో కూడా తెలుసుకోవాలన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top