వరంగల్ జిల్లాలోని తడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి, అజ్ఞాతనేత కామ్రేడ్ డిమాండ్ చేశారు.
తొర్రూరు: వరంగల్ జిల్లాలోని తడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి, అజ్ఞాతనేత కామ్రేడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కామ్రేడ్ శృతి, విద్యాసాగర్‌రెడ్డిలను ఎన్‌కౌంటర్ పేరుతో కాల్చి చంపడాన్ని న్యూడెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. నక్సలైట్ల ఏజెండానే మా ఏజెండా అని ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారై ఎంపీ కవిత అనేకసార్లు ప్రకటించిందన్నారు.
నక్సలైట్లను బూటకపు ఎన్‌కౌంటర్ల పేరుతో తుదముట్టించడమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఏజెండానా అని ప్రశ్నించారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక మార్పులు రాకుండా బూటకపు ఎన్‌కౌంటర్లతో బంగారు తెలంగాణ ఏలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పౌర హక్కుల గురించి మాట్లాడిన కేసీఆర్ గద్దెనెక్కిన తర్వాత పౌర హక్కులను హరించేవిధంగా పని చేయాడం దుర్మార్గమన్నారు.