
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని సైబర్‌బాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆయన గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల రద్దీ కొంత తగ్గిందని పేర్కొన్నారు. రవాణా,వైద్య శాఖ, కలెక్టర్ల సహకారంతో జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్ని రిసీవ్ చేసుకోవడానికి బంధుమిత్రులెవరూ రావద్దని ఆయన సూచించారు. గచ్చిబౌలి,ఎన్‌ఆర్డీ, వికారాబాద్, రాజేంద్రనగర్‌లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. (తల్లి.. బిడ్డలు.. మధ్య కరోనా!)
ఐసోలేషన్ వార్డుల దగ్గరికి ఎవరూ రావద్దని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ తెలిపారు. 1300 మందిని ఐసోలేషన్ చేశామని పేర్కొన్నారు. ఐసోలేషన్ వార్డుల్లో కూడా కట్టు దిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. (కరోనా సోకిందన్న అనుమానంతో.. )