దర్గాలో దంపతుల హత్య | couple murdered in darga | Sakshi
Sakshi News home page

దర్గాలో దంపతుల హత్య

Apr 23 2015 11:05 AM | Updated on Sep 3 2017 12:45 AM

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. దర్గాలో నిద్రిస్తున్న దంపతుల్ని దుండగులు బండరాళ్లతో మోది హత్య చేశారు.

నిజామాబాద్(ఎడవల్లి): నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. దర్గాలో నిద్రిస్తున్న దంపతుల్ని దుండగులు బండరాళ్లతో మోది హత్య చేశారు. వివరాలు... ఎడపల్లి మండలం జానకం పేట గ్రామానికి చెందిన సయ్యద్ దావూద్ అలీ(58), రహ్మానా బేగం(54)లు బుధవారం రాత్రి అశోక్ సాగర్ దర్గాలో కాపలాకు ఉన్నారు. అయితే అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు వారిపై బండరాళ్లు వేసి చంపేశారు. గురువారం ఉదయం ఈ దారుణం వెలుగు చూసింది.

 

దుండగుల్ని కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు జానకంపేట రహదారిపై రాస్తారోకోకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారితో చర్చలు ప్రారంభించారు. కాగా మృతులు స్థానికంగా హోటల్ నడుపుతూ జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం.

 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement