పాలు పోయించుకుని పొమ్మన్నారు: జీతం అడిగితే పోలీస్‌ కేసు!

Dairy Farmer Press Meet On Harrassment Of Payment Issue In Bodhan - Sakshi

పాలు పోయించుకుని చెల్లింపులు చేయలేదని ఆరోపణలు

కేసు నమోదు చేయించారని ఓ పాడి రైతు ఆవేదన

ఎడపల్లి (బోధన్‌): నెలల తరబడి పని చేసినందుకు జీతం అడిగితే.. ఓ యువకుడిపై సంబంధిత అధికారులు పోలీసు కేసు నమోదు చేయించారు. వివరాలను బాధితుడు బోధన్‌లోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మీడియాతో మాట్లాడాడు. ఎడపల్లి మండలంలోని జైతాపూర్‌ గ్రామానికి చెందిన కె.శివకుమార్‌ అనే విద్యార్థి గ్రామంలో ఉన్న విజయ డెయిరీ పాల కేంద్రంలో గత 20 నెలలుగా పనిచేశాడు. కొన్ని నెలలు సక్రమంగా జీతం చెల్లించిన అధికారులు ఆ తర్వాత వేతనాలు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. అంతేగాక తాను పనిచేసిన కాలంలో ప్రతి రోజు తాను డెయిరీకి పంపించిన పాలలో వెన్న శాతంలో కోత, పాల తూకంలో కోతలు విధిస్తూ ప్రతి నెల సుమారు రూ.ఐదువేల నష్టం చేకూర్చారని శివకుమార్‌ ఆరోపించారు.
చదవండి: వాటికి వ్యతిరేకంగానే నా సినిమా: ఆర్‌.నారాయణమూర్తి

డెయిరీ నుంచి వచ్చిన నష్టం నిజమేనని డెయిరీ సూపర్‌వైజర్‌లు కూడా ధృవీకరించారు. 11 నెలల కాలంలో వచ్చిన 55 వేల రూపాయలు నష్టం, 11 నెలల నెలసరి జీతం 55 వేల రూపాయలు తనకు డెయిరీ వారు చెల్లించాల్సి ఉందని శివకుమార్‌ తెలిపారు. దీంతో తాను రైతులకు రూ.37 వేలు బకాయి పడ్డానని ఆయన తెలిపారు. డెయిరీ అధికారులు తాను రైతులకు రూ.89 వేలు చెల్లించాల్సి ఉందని ఆరోపిస్తు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వాస్తవం లేదన్నారు. విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్‌ నందకుమారి తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారని శివకుమార్‌ ఆరోపించారు. ఈ విషయమై డీడీ నందకుమారి వైఖరిపై విజయ డెయిరీ ఎండీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేసినట్లు శివకుమార్‌ తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.

చదవండి: ఫైవ్‌స్టార్‌ చాక్లెట్స్‌తో పాఠశాలకు ఆహ్వానం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top