breaking news
Dairy Collection Price
-
పాలు పోయించుకుని పొమ్మన్నారు: జీతం అడిగితే పోలీస్ కేసు!
ఎడపల్లి (బోధన్): నెలల తరబడి పని చేసినందుకు జీతం అడిగితే.. ఓ యువకుడిపై సంబంధిత అధికారులు పోలీసు కేసు నమోదు చేయించారు. వివరాలను బాధితుడు బోధన్‌లోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మీడియాతో మాట్లాడాడు. ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామానికి చెందిన కె.శివకుమార్ అనే విద్యార్థి గ్రామంలో ఉన్న విజయ డెయిరీ పాల కేంద్రంలో గత 20 నెలలుగా పనిచేశాడు. కొన్ని నెలలు సక్రమంగా జీతం చెల్లించిన అధికారులు ఆ తర్వాత వేతనాలు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. అంతేగాక తాను పనిచేసిన కాలంలో ప్రతి రోజు తాను డెయిరీకి పంపించిన పాలలో వెన్న శాతంలో కోత, పాల తూకంలో కోతలు విధిస్తూ ప్రతి నెల సుమారు రూ.ఐదువేల నష్టం చేకూర్చారని శివకుమార్ ఆరోపించారు. చదవండి: వాటికి వ్యతిరేకంగానే నా సినిమా: ఆర్.నారాయణమూర్తి డెయిరీ నుంచి వచ్చిన నష్టం నిజమేనని డెయిరీ సూపర్వైజర్లు కూడా ధృవీకరించారు. 11 నెలల కాలంలో వచ్చిన 55 వేల రూపాయలు నష్టం, 11 నెలల నెలసరి జీతం 55 వేల రూపాయలు తనకు డెయిరీ వారు చెల్లించాల్సి ఉందని శివకుమార్ తెలిపారు. దీంతో తాను రైతులకు రూ.37 వేలు బకాయి పడ్డానని ఆయన తెలిపారు. డెయిరీ అధికారులు తాను రైతులకు రూ.89 వేలు చెల్లించాల్సి ఉందని ఆరోపిస్తు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వాస్తవం లేదన్నారు. విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ నందకుమారి తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారని శివకుమార్ ఆరోపించారు. ఈ విషయమై డీడీ నందకుమారి వైఖరిపై విజయ డెయిరీ ఎండీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేసినట్లు శివకుమార్ తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. చదవండి: ఫైవ్‌స్టార్ చాక్లెట్స్‌తో పాఠశాలకు ఆహ్వానం -
విజయ పాల ధర రూపాయి పెంపు
నేటి నుంచి అమల్లోకి కొత్త ధర సాక్షి, హైదరాబాద్: పాడి రైతులకు ఉగాది కానుకగా పాల సేకరణ ధరను లీటరుకు గరిష్టంగా రూ.2 చొప్పున పెంచిన తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య అందులో రూపాయి భారాన్ని వినియోగదారులపై మోపింది. విజయ పాల ధరను లీటరుకు రూపాయి చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. నేటి నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని సమాఖ్య చైర్మన్ లోకా భూమారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాల సేకరణ ధర పెంపు సైతం నేటి నుంచే అమల్లోకి వస్తుందన్నారు. 2017 జనవరి వరకు రూ.4 చొప్పున ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రోత్సాహక ధర బకాయిలను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, ఫిబ్రవరి నుంచి పాల బిల్లులతోపాటే ప్రోత్సాహకం చెల్లిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఆరు శాతం వెన్న ఉన్న గేదె పాలకు లీటరుకు రూ. 35.80 రైతులకు చెల్లిస్తుండగా.. పెరిగిన ధర ప్రకారం రూ. 37.80 చెల్లిస్తామన్నారు. అలాగే 3.5 శాతం వెన్న ఉన్న ఆవు పాలకు ప్రస్తుతం లీటరుకు రూ. 28.36 చెల్లిస్తుండగా ఇకపై రూ. 30.36 చెల్లిస్తామని చెప్పారు.