వ్యవసాయ వర్సిటీలో పలు కోర్సులకు కౌన్సెలింగ్‌

Counseling for various courses in Agricultural University - Sakshi

హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ డిప్లొమా కోర్సుల్లో ఏర్పడిన ఖాళీల భర్తీకి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ ఎస్‌.సుధీర్‌కుమార్‌ తెలిపారు. వర్సిటీ ఆడిటోరియంలో ఈ నెల 24న ఉదయం 10కి కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుందన్నారు.

మరోవైపు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, పీవీ నర్సింహారావు వెటర్నరీ, కొండా లక్ష్మణ్‌ ఉద్యాన వర్సిటీల్లో బైపీసీ స్ట్రీమ్‌ డిగ్రీ కోర్సుల్లో దివ్యాంగుల కేటగిరీ సీట్లను భర్తీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించి 25న వర్సిటీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు  ఠీఠీఠీ.p్జ్టట్చu.్చఛి.జీn లో చూడాలని ఆయన సూచించారు.  

వచ్చేనెల 21 నుంచి ప్రీప్రైమరీ శిక్షణ కోర్సు..
జయశంకర్‌ వర్సిటీ పరిధిలో హోంసైన్స్‌ కళాశాల.. మానవ అభివృద్ధి, కుటుంబ అధ్యయన విభాగం 21 రోజుల ప్రీప్రైమరీ శిక్షణ కోర్సును వచ్చే నెల 21 నుంచి నిర్వహించనున్నట్లు ఆ కాలేజీ అసోసియేట్‌ డీన్‌ విజయలక్ష్మి తెలిపారు. సైఫాబాద్‌లోని గృహ విజ్ఞాన కాలేజీ ప్రాంగణంలో ఈ కోర్సు నిర్వహిస్తామని, అభ్యర్థులు 8019115363/ 9059320689 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top