తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఆదివారం నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలంగాణ గురుకుల సొసైటీ కార్యదర్శి శేషుకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సాక్షి, హైదరాబాద్:
తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఆదివారం నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలంగాణ గురుకుల సొసైటీ కార్యదర్శి శేషుకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న ఎంపీసీ విద్యార్థులకు, 23న బైపీసీ, ఎంఈసీ, సీఈసీ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు.
నాలుగు గురుకుల జూనియర్ కాలేజీల్లో 510 సీట్ల భర్తీకి 1:5 చొప్పున ఇంటర్వూ్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఇంటర్వూ్యకు ఎంపికైన వారి వివరాలను తమ వెబ్‌సైట్‌లో (tsrjdc.cgg.gov.in) విద్యార్థులు తమ హాల్‌టికెట్ సహాయంతో పొందవచ్చని సూచించారు. బాలురకు సర్వేల్‌లోని గురుకుల జూనియర్ కాలేజీ, బాలికలకు హసన్‌పర్తిలోని గురుకుల జూనియర్ కాలేజీలో కౌన్సెలింగ్ ఉంటుందని వెల్లడించారు.