CoronaVirus: Nizamabad Urban MLA Bigala Ganesh Tests Positive | తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా - Sakshi
Sakshi News home page

తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా

Jun 15 2020 4:24 PM | Updated on Jun 15 2020 6:54 PM

Coronavirus Nizamabad Urban MLA Bigala Ganesh Gupta Tests Positive - Sakshi

గత రెండు రోజులుగా కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో ఎమ్మెల్యే పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది. 

సాక్షి, నిజామాబాద్ : తెలంగాణలో ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరూ కరోనా బారినపడుతున్నారు. తాజాగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో ఎమ్మెల్యే పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది. ఇప్పటికే నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. 

బాజిరెడ్డి గోవర్ధన్‌తో ఎమ్మెల్యే బిగాల కాంటాక్ట్ అయినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇటీవల కరోనా సోకిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని ఎమ్మెల్యే గోవర్ధన్‌ కలిసినట్టు‌ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ఓ సమీక్షా సమావేశం సందర్భంగా బాజిరెడ్డి, ముత్తిరెడ్డితో మాట్లాడినట్లు తెలిసింది.
(చదవండి: ఎమ్మెల్యే బాజిరెడ్డికి కరోనా పాజిటివ్‌)

Advertisement
 
Advertisement
Advertisement