మరో కరోనా మరణం

Corona: 70 Years Old Died In Jagtial - Sakshi

సాక్షి, కోరుట్ల : కరోనాతో మరో వృద్ధుడు మృతి చెందాడు. జగిత్యాల జిల్లాలో మొదటి కరోనా కేసు వెలుగు చూసిన కోరుట్ల మున్సిపాలిటీ పరిధిలోనే ముంబయి నుంచి వచ్చిన ఓ వృద్ధుడు(70) సోమవారం గాంధీ ఆసుపత్రిలో కరోనాతో చనిపోగా అతని భార్య చికిత్స పొందుతోంది. మృతుడి అంత్యక్రియలు అక్కడే నిర్వహించనున్నట్లు తెలిసింది. (ఏపీలో ప్రారంభమైన దేశీయ విమాన సర్వీసులు )

ముంబయిలో పెళ్లికి హాజరు..
కోరుట్లలోని కల్లూర్‌రోడ్‌ వెంట భీమునిదుబ్బలో నివాసముండే వృద్దుడు తన భార్యతో కలిసి ముంబయిలో మార్చిలో జరిగిన బంధువుల పెళ్లికి హాజరయ్యాడు. ఆ తర్వాత కోరుట్లకు వచ్చే క్రమంలో మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించారు. దీంతో వారు ముంబయిలోనే ఉండే తమ కుమారుడి ఇంట్లో ఉండిపోయారు. లాక్‌డౌన్‌ సడలింపులతో ఈ నెల 14న స్వగ్రామం వచ్చేశారు. అప్పటికే జ్వరం, జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్న వృద్ధున్ని గుర్తించిన వైద్య సిబ్బంది అతనితో పాటు భార్యను కొండగట్టు ఐసోలేషన్‌కు పంపారు. ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో గత అదివారం గాంధీ ఆస్పత్రికి పంపించారు. వారం పాటు అక్కడ చికిత్స తీసుకున్న బాధితుడు సోమవారం మృతి చెందాడు. (ప్రశాంత్‌ కిషోర్‌కు పోటీగా సునీల్‌)

చివరిచూపు దక్కలేదు..
కుటుంబసభ్యులకు వృద్ధుని భౌతికకాయాన్ని కడసారి చూసుకునే అవకాశం దక్కలేదు. మృతుని భార్య గాంధీలోనే చికిత్స పొందుతుండగా కుమారుడు, కోడలు, వారి పిల్లలు కొండగట్టు ఐసోలేషన్‌లో ఉన్నారు. సీఐ రాజశేఖర్, తహసీల్దార్‌ సత్యనారాయణ, కమిషనర్‌ ఆయాజ్‌లు వృద్ధుడి కుమారుని నుంచి అంగీకారప త్రం తీసుకున్నారు. గాంధీ ఆసుపత్రిలోనే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top