ఎన్టీఆర్‌ నగర్‌లో కార్డన్‌ సెర్చ్‌

Cordon Search In Thallada - Sakshi

పత్రాలు లేని 20 బైక్‌లు, రెండు ఆటోల సీజ్‌

80 మంది పోలీసుల తనిఖీలు

తల్లాడ : వైరా ఏసీపీ ప్రసన్నకుమార్‌ ఆధ్వర్యంలో సబ్‌ డివిజన్‌లోని 80 మంది పోలీసులు తల్లాడ సమీపంలోని ఎన్టీఆర్‌ నగర్‌లో మంగళవారం వేకువజామున కార్డన్‌ సెర్చ్‌ చేశారు. ప్రతి ఇంటిలోని సభ్యుల ఆధార్‌ కార్డులను తనిఖీ చేశారు. వాహనాల తనిఖీ చేసి పత్రాలు లేని 20 బైక్‌లు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నా రు. ఈ సందర్భంగా ఏసీపీ ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌నగర్‌.. ప్రభుత్వ స్థలంలో నిర్మించిందని, ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారని, వారి ఇళ్లకు ఎవరు వచ్చి పోతున్నారో పరిశీలించాలన్నారు. అపరిచితులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అలా సమాచారం ఇవ్వటం వల్ల నేరస్తులను గుర్తించ వచ్చన్నారు. కార్యక్రమంలో సీఐ నాయుడు మల్లయ్యస్వామి, మధిర సీఐ శ్రీధర్, తల్లాడ, వైరా, చింతకాని, కొణిజర్ల, మధిర టౌన్, బోనకల్లు ఎస్‌ఐలు మేడా ప్రసాద్, టి.నరేష్, మొగిలి, ఎస్‌.సురేష్, తిరుపతరెడ్డి, ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top