రెండో రోజూ కొనసాగిన సర్వే | Continued second daily Family Survey | Sakshi
Sakshi News home page

రెండో రోజూ కొనసాగిన సర్వే

Aug 21 2014 2:25 AM | Updated on Mar 21 2019 8:23 PM

రెండో రోజూ కొనసాగిన సర్వే - Sakshi

రెండో రోజూ కొనసాగిన సర్వే

కలెక్టర్ చిరంజీవులు ఆదేశాల మేరకు స్థానిక తహసీల్దార్ పుష్పలత.. మండలంలోని వర్కాల, ఘడియగౌరారం, మల్లారెడ్డిపల్లి గ్రామాలలో రెం డో రోజైన బుధవారం కూడా సమగ్ర కుటుంబ సర్వేను కొనసాగించారు.

చింతపల్లి :కలెక్టర్ చిరంజీవులు ఆదేశాల మేరకు స్థానిక తహసీల్దార్ పుష్పలత.. మండలంలోని వర్కాల, ఘడియగౌరారం, మల్లారెడ్డిపల్లి గ్రామాలలో రెం డో రోజైన బుధవారం కూడా సమగ్ర కుటుంబ సర్వేను కొనసాగించారు. ఘడియగౌరారం, మ ల్లారెడ్డిపల్లిలలో సర్వే సాఫీగా సాగింది. కానీ వర్కాలలో మాత్రం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వర్కాలకు చెందిన శ్రీను అనే వ్యక్తికి గ్రామంలో రేషన్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, సొంత ఇల్లు ఉన్నా అతని పేరు సర్వేలో నమోదు చేయకపోవడంతో ఎన్యుమరేటర్‌ను సంప్రదిస్తున్నాడు. ఆ సమయంలో వర్కాల సర్పంచ్ కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ విషయమై  కల్పించుకుని తహసీల్దార్ ఎదుటే శ్రీనుపై దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు  గ్రామానికి చేరుకుని సర్వే ప్రశాంతంగా కొనసాగేలా చర్యలు చేపట్టారు.
 
 అద్దె కుటుంబాల సర్వే
 వాడపల్లి(దామరచర్ల): మండల పరిధిలోని వాడపల్లి గ్రామంలో అద్దెకు ఉంటున్న కుటుంబాలను కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం సర్వే చేశారు. గ్రామంలో వేరే ప్రాంతాల నుంచి వచ్చి అద్దె ఇళ్లలో ఉంటున్న కుటుంబాలను ఎన్యుమరేటర్లు మంగళవారం సర్వే చేయలేదు. దీంతో వారు స్థానిక నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక అధికారులను సర్వే చేయాలని కోరినప్పటికీ స్పందించక పోవడంతో మంగళవారం రాత్రి ఫోన్ ద్వారా కలెక్టర్‌కు ఈ విషయం చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తసీల్దార్ రమాదేవి.. అద్దెకు ఉంటున్న వారిని సర్వే చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. 120 ఇళ్లను ఎనిమిది మంది ఎన్యుమరేటర్ల ద్వారా గ్రామ పంచాయ తీ కార్యాలయంలో సర్వే చేయించారు. ఈ విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శి కేశ్యానాయక్‌కు ఎంపీడీఓ ఉమాదేవి మెమో జారీ చేశారు.
 
 అన్ని కుటుంబాల సర్వే పూర్తి చేయాలని ధర్నా
 బేగంపేట(రాజాపేట) : అన్ని కుటుంబాల సర్వే పూర్తి చేయాలని కోరుతూ మండలంలోని బేగంపేటవాసులు బుధవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట గంట పాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడారు. సమగ్ర సర్వేలో కొందరిని మాత్రమే గుర్తించి సర్వే చే శారని మిగిలినవారిని పట్టించుకోలేదన్నారు. ఒక ఇంటిలో మూడు కుటుంబాలు ఉన్నా ఒకే కుటుంబంగా గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అన్ని కుటుంబాలను సర్వే చేయడానికి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సుదగాని వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement