కానిస్టేబుల్ పరుగులో 385 మందికి అర్హత | Constable 385 people eligible to run | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్ పరుగులో 385 మందికి అర్హత

Jul 16 2016 8:07 PM | Updated on Sep 17 2018 6:26 PM

కానిస్టేబుల్ పరుగులో 385 మందికి అర్హత - Sakshi

కానిస్టేబుల్ పరుగులో 385 మందికి అర్హత

పోలీస్ కానిస్టేబుల్ నియామకం కోసం నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షల్లో భాగంగా నిర్వహించిన 800 మీటర్ల పరుగులో 385 మంది అర్హత సాధించారని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

పోలీస్ కానిస్టేబుల్ నియామకం కోసం నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షల్లో భాగంగా నిర్వహించిన 800 మీటర్ల పరుగులో 385 మంది అర్హత సాధించారని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు పరుగు పందెం నిర్వహించారు. తప్పనిసరి అర్హత సాధించాల్సిన 800 మీటర్ల పరుగు కోసం పురుష అభ్యర్థులు 558 మందికి హాజరు కాగా 328 మంది, మహిళా విభాగంలో 73 మంది అభ్యర్థులు హాజరు కాగా 57 మంది అర్హులయ్యారని పేర్కొన్నారు.

వీరు అన్ని ధృవపత్రాలతో హాజరు కావాలని సూచించారు. వీరికి ధృవపత్రాల పరిశీలన, ఎత్తు, ఛాతి కొలతలు, బరువు, 100 మీటర్ల పరుగు, హై, లాంగ్ జంప్ తదితర ఈ వెంట్లు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా అదనపు ఎస్పీ వెంకన్న, సీఐలు శ్యామల వెంకటేశ్, శ్రీనివాసనాయుడు, లింగేశ్వర్, ఎస్సైలు రవీందర్‌రెడ్డి, నాగేశ్వర్‌రావు, మధు, సిబ్బంది ఆధ్వర్యంలో ప్రక్రియ కొనసాగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement