కాంగ్రెస్‌ నుంచి ఆరుగురు నేతల బహిష్కరణ

Congress Take Action On Six Leaders In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ నియమాళికి వ్యతిరేకంగా పనిచేసిన ఆరుగురు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలపై ఆపార్టీ క్రమశిక్షణా కమిటీ చర్యలు తీసుకుంది. పార్టీ అదేశాలను ఉల్లంఘించినందుకు ఆరేపల్లి మోహన్‌, రమ్యారావు, మన్నె కృష్ణ, సోయం బాపూరావు, నరేశ్‌ జాదవ్‌, పట్లోల్ల కార్తీక్‌ రెడ్డిలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఈమేరకు టీకాంగ్రెస్‌ క్రమశిక్షణ సంఘం​ ఛైర్మన్‌ కోదండరెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే వరుసగా పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలపై కాంగ్రెస్‌ అధిష్టానం సీరియస్‌ అయ్యింది.
కాంగ్రెస్‌ పార్టీ ఖాళీ..? 

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌పై గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు కూడా షోకాజు నోటీసులు జారీచేయాలని భావిస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కోదండరెడ్డి తెలిపారు. టీఆర్‌ఎస్‌లో చేరిన శాసనసభ్యుల సంఖ్య ఇప్పటికే ఏడుకి చేరిన విషయం తెలిసిందే. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణపేట అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన శివకుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేస్తున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది. 
కాంగ్రెస్‌లో... మిగిలింది ఒక్కరే!
కాంగ్రెస్‌కు షాక్‌.. కారెక్కిన మాజీ ఎమ్మెల్యే

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top