'కళంకిత మంత్రులను వెంటనే తొలగించాలి' | Congress Stage rasta roko | Sakshi
Sakshi News home page

'కళంకిత మంత్రులను వెంటనే తొలగించాలి'

Jul 10 2015 4:25 PM | Updated on Sep 4 2018 5:16 PM

'కళంకిత మంత్రులను వెంటనే తొలగించాలి' - Sakshi

'కళంకిత మంత్రులను వెంటనే తొలగించాలి'

కేంద్ర ప్రభుత్వ మంత్రి వర్గంలో ఉన్న కళంకిత మంత్రులను వెంటనే తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది.

ఎల్బీనగర్ (హైదరాబాద్) : కేంద్ర ప్రభుత్వ మంత్రి వర్గంలో ఉన్న కళంకిత మంత్రులను వెంటనే తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ ఎల్బీనగర్ చింతల్‌కుంటలో జాతీయ రహదారి-65 పై రాస్తోరోకో నిర్వహించారు. కళంకిత మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను రోడ్డుపై దహనం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు. జాతీయరహదారిపై రాస్తోరోకోకు దిగడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
 

Advertisement
 
Advertisement
Advertisement