కాంగ్రెస్‌ గెలిచినందుకే వివక్ష | congress mla dk aruna slams trs government | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ గెలిచినందుకే వివక్ష

Jul 21 2017 4:03 PM | Updated on Oct 1 2018 2:09 PM

జూరాల ప్రాజెక్టు కిందవున్న పంటలకి తక్షణమే నీటిని విడుదల చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్‌: జూరాల ప్రాజెక్టు కిందవున్న పంటలకి తక్షణమే నీటిని విడుదల చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ డిమాండ్‌ చేశారు. విలేకరులతో మాట్లాడుతూ.. నార్లు పోసుకోవడానికి నీటిని విడుదల చేయాలని ఇప్పటికే రైతులు పలుమార్లు ధర్నాలు చేశారని, గతంలో ప్రతి సంవత్సరం జూరాల నుంచి నీటి విడుదల చేసేవారని గుర్తు చేశారు. జూరాల నుంచి నీటిని విడుదల చేయడంలో పక్షపాతం చూపిస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
 
జూరాల నుంచి కోహిలసాగర్‌ కు నీటివిడుదల చేస్తారు కానీ ఆయకట్టు కింద వున్న రైతులకి నీటివిడుదల చేయడంలో నిర్లక్ష్యం ఎందుకు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిచిన నియోజకవర్గం కాబట్టే వివక్ష చూపుతున్నారా అని సూటిగా అడిగారు. ఇప్పటికైనా మీనమేషాలు లెక్కించడం పక్కనబెట్టి నార్లు వేసుకోవడానికి రైతులకి తక్షణమే నీటి విడుదల చేయాలని కోరారు. జూరాల కింద వున్న రిజర్వాయర్లని వెంటనే నీటితో నింపాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement