కాంగ్రెస్‌కు వ్యూహమే లేదు: హరీశ్‌ | congress don't have an idea :hareesh rao | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు వ్యూహమే లేదు: హరీశ్‌

Mar 23 2017 3:18 AM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్‌కు వ్యూహమే లేదు: హరీశ్‌ - Sakshi

కాంగ్రెస్‌కు వ్యూహమే లేదు: హరీశ్‌

శాసనసభ సమావేశాల చర్చల్లో పాల్గొనడానికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు ఎలాంటి వ్యూహం లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ సమావేశాల చర్చల్లో పాల్గొనడానికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు ఎలాంటి వ్యూహం లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రజా సమస్యలపై చర్చను వదిలేసి రాజకీయ వేదికగా అసెంబ్లీని వాడుకోవాలని చూస్తోందన్నారు. బుధవారం ఆయన మీడియాతో ముచ్చటించారు. ఎజెండా లేకుండా, ఏ అంశానికి ప్రాధాన్యం ఉందో తెలుసుకోలేకపోతోందన్నారు. లేవనెత్తకూడని అంశాలను లేవనెత్తి తామే ఇరుక్కుని ఇబ్బంది పడుతున్నారన్నారు. లోతుగా అధ్యయనం చేయకుండా సభకు వస్తున్న ప్రధాన ప్రతిపక్షం విమర్శల పాలవుతోందని పేర్కొన్నారు.  

కాంగ్రెస్‌ సభ్యుల రొటేషన్‌: తలసాని
కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సమావేశాలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. సభలో చర్చ జరిగే సమయంలో కాంగ్రెస్‌ సభ్యులంతా ఉండడం లేదన్నారు. రొటేషన్‌ పద్ధతిలో నలుగురు చొప్పున సభకు వస్తున్నారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement