పాత టికెట్లు ఇచ్చి పైసలు వసూలు చేసిన కండక్టర్‌ 

The Conductor Gave the Old Tickets to the Passengers - Sakshi

పోలీసులకు ఫిర్యాదు చేసిన డిపో మేనేజర్‌

షాద్‌నగర్‌రూరల్‌ : ప్రయాణికులకు పాత టికెట్లు ఇచ్చి డబ్బులు వసూలు చేసిన తాత్కాలిక కండక్టర్‌ ఉదంతం ఒకటి శనివారం వెలుగు చూసింది. షాద్‌నగర్‌ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో శనివారం ఫరూఖ్‌నగర్‌ మండలం నేరేళ్ళచెరువు గ్రామానికి చెందిన ప్రైవేట్‌ కండక్టర్‌ కె.శివకుమార్, డ్రైవర్‌ ఎండీ గౌస్‌ విధులు నిర్వహిస్తున్నారు. అయితే, బస్సును గద్వాల డిపో మేనేజర్‌ మురళీధర్‌రెడ్డి షాద్‌నగర్‌లో తనికీ చేశారు. టికెట్ల అమ్మకం ప్రకారం కండక్టర్‌ కె.శివకుమార్‌ క్యాష్‌ బ్యాగ్‌లో రూ.3143 ఉండాలి. కానీ, రూ.4470 ఉన్నట్లు గుర్తించారు.

అదనంగా ఉన్న డబ్బుల గురించి కండక్టర్‌ను ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పడం లేదని డీఎం వివరించారు. ప్రయాణికులకు టికెట్లు అమ్మిన తర్వాత వాటిని తిరిగి కండక్టర్‌ ప్రయాణికుల నుంచి తీసుకొని బ్యాగులో ఉంచుకున్నట్లు తెలిపారు. కండక్టర్‌ కె.శివకుమార్‌ పాత టికెట్లను ప్రయాణికులకు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తాము గుర్తించామని డీఎం తెలిపారు. ఈ మేరకు శివకుమార్‌పై చర్యలు తీసుకోవాలని షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు డిపో మేనేజర్‌ మురళీధర్‌రెడ్డి తెలిపారు.  శివకుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ సీఐ శ్రీధర్‌ కుమార్‌ తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top