దుమ్ము దులుపుతున్నారు | Computerized records to the collector command | Sakshi
Sakshi News home page

దుమ్ము దులుపుతున్నారు

Aug 27 2015 4:11 AM | Updated on Mar 21 2019 8:24 PM

దుమ్ము దులుపుతున్నారు - Sakshi

దుమ్ము దులుపుతున్నారు

పరిపాలన సౌలభ్యంలో బాగంగా పాత రికార్డులను కంప్యూటరీకరించాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా ఆదేశించిచడంతో ఆయా శాఖల సిబ్బంది పాత ఫైళ్ళను బయటకు తీసి దుమ్ము దులుపుతున్నారు...

- రికార్డుల కంప్యూటరీకరణకు కలెక్టర్ ఆదేశం
- పాత ఫైళ్లను బయటకు తీస్తున్న సిబ్బంది
ప్రగతినగర్:
పరిపాలన సౌలభ్యంలో బాగంగా పాత రికార్డులను కంప్యూటరీకరించాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా ఆదేశించిచడంతో ఆయా శాఖల సిబ్బంది పాత ఫైళ్ళను బయటకు తీసి దుమ్ము దులుపుతున్నారు. 2014 ఆగస్టు నుంచి మాత్రమే రికార్డులు ఆన్‌లైన్‌లో ఉన్నాయన్న విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లింది. అంతకు ముందు సంవత్సరాల ముఖ్యమైన రికార్డులను కూడా ఈ నెల 30వ తేదీ నాటికి కంప్యూటరీకరించి ఆన్‌లైన్‌లో పొందుపరచాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ శాఖలోని పాత ఫైళ్ళ కం ప్యూటరీకరణ పని ఇప్పటికే మొదలైంది. డీ ఆర్‌వో, ఆర్‌డీవో, తహశీల్దార్, లాండ్ అండ్ రెవన్యూ శాఖ రికార్డుల కంప్యూటీకరణ పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. రెవెన్యూలోని అన్ని సెక్షన్ల ఉద్యోగుల ముందు పాత ఫైళ్లు గుట్టలు గుట్టలుగా కనిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement