breaking news
old records
-
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో దొంగలు పడ్డారు
కొవ్వూరు: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దొంగలు పడ్డారు. అవును మీరు విన్నది నిజమే. అయితే ఎటువంటి సొత్తు చోరీ కాలేదు. పాత రికార్డులోని కొన్ని పేజీలు మాత్రం గల్లంతయ్యాయి. దీనిపై ఓ అజ్ఞాత వ్యక్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగుచూసింది. ఇది ఇంటి దొంగల పనా..? బయట వ్యక్తులు చేశారా అన్నది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. వివరాల్లోకి వెళితే.. కొవ్వూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో 1998కి చెందిన దస్తావేజు కాపీ రికార్డు (ఫైల్ వ్యాల్యూమ్)లోని కొన్ని పేజీలు గల్లంతయ్యాయి. దీనిపై ఫిర్యాదు అందడంతో ఉన్నతాధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న ఆరుగురు సిబ్బం దిపై బదిలీ వేటు వేశారు. రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 1999 నుంచి రికార్డులను ఆన్లైన్ చేస్తున్నారు. అంతకు ముందు రికార్డులన్నీ మాన్యువల్‌గా ఉన్నాయి. కొవ్వూరు కా ర్యాలయంలో ఉండే మాన్యువల్ రికార్డుల్లో కొన్నిపేజీలు గల్లంతవడం చర్చనీయాంశంగా మారింది. 10న డీఐజీ విచారణ కొవ్వూరుకి చెందిన గారపాటి రవికిషోర్ అనే వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు, సీఎంకు, డీఐజీకి రికార్డులో పేజీలు గల్లంతుపై ఫిర్యాదు అందింది. దీనిపై స్పందించిన స్టాంప్స్ అండ్ రిజి స్ట్రేషన్ శాఖ డీఐజీ బి.సూర్యనారాయణ ఈనెల 10న విచారణకు ఆదేశించారు. జిల్లా రిజిస్ట్రార్ పి.విజయలక్ష్మిని విచారణాధికారిగా నియమించారు. ఆమె అదేరోజు పేజీల గల్లంతుపై కొవ్వూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని 1007 నంబర్లోని ఒరిజినల్ ఫైల్ వ్యాలూమ్లో ఉండాల్సిన 2135, 2136, 2137, 2138 అనే నాలుగు నంబర్లకు సంబంధించిన పేజీలను చించుకునిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసుస్టేషన్లో క్రైమ్ నం.202/2018 కింద కేసు నమోదయ్యింది. ఐపీసీ 427,379 నంబర్ల కింద కేసు రిజిస్ట్రర్ అయ్యింది. ఎవరా అజ్ఞాతవాసి రికార్డులో పేజీలు గల్లంతుపై ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. అసలు గారపాటి రవికిషోర్ అనే వ్యక్తి కొవ్వూరులో ఎవరూ లేరనేది ప్రాథమికంగా గుర్తిం చారు. వాస్తవంగా రికార్డు గదిలోకి బయట వ్యక్తులు వెళ్లే అవకాశం లేదు. పేజీలు గల్లంతైన వ్యవహారం బయట వ్యక్తులకు తెలిసే అవకాశాలు తక్కువ. దీనిని బట్టి ఇక్కడ పనిచేసే సిబ్బంది సహకారంతోనే ఈ తంతు జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఏ తేదీన ఎవరు సబ్ రిజిస్ట్రార్‌గా, ఎవరెవరు విధుల్లో ఉండగా ఇది జరిగిందనే విషయం పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. గతంలో ఇక్కడ ఇన్చార్జ్ సబ్రిజిస్ట్రార్లుగా పనిచేసిన వారి పేర్లతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది పేర్లను, వారు చేస్తున్న ఉద్యోగం వివరాలను జిల్లా రిజిస్ట్రార్ విజయలక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరో తెలితే విచారణ సులభం కావడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఫిర్యాదుదారుడు గుర్తుతెలియని వ్యక్తి కావడంతో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిలో ఎవరైనా నింది తులు ఉంటే నేరం రుజువు కావడంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుందని భావించిన అధికారులు ఆరుగురిని బదిలీ చేసినట్టు తెలుస్తోంది. ఆయా పేజీల్లో ఏముంది..! రికార్డులో గల్లంతైన పేజీలు ఎవరి ఆస్తికి సంబంధించినవి అనే అంశం ఆసక్తిగా మారింది. ఇప్పటికే అధికారులు ఈ రికార్డుని సీజ్ చేశారు. గల్లంతైన పేజీలకు సంబంధించిన ఆస్తుల వివరాలు గురించి అడిగితే అధికారులు నోరు విప్పడంలేదు. విచారణలో ఉందని దాట వేస్తున్నారు. వాస్తవంగా ఈ ఘటన రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు గుణపాఠం నేర్పిందనే చెప్పవచ్చు. ఈ ఘటనలో నేరానికి పా ల్పడిన వ్యక్తి ఎవరనేది తేలకపోవడంతో ఇక్కడ పనిచేసే సిబ్బంది అంతా బాధ్యులు కావాల్సి వచ్చింది. గల్లంతైన నాలుగు పేజీలకు సంబంధించిన ఆస్తుల నకళ్లు తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో ఆయా నంబర్లకు సంబంధించి ఎవరైనా నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఆస్తులను విక్రయించి సొమ్ములు చేసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది మధ్య మా మూళ్ల వాటాలు తేలకపోవడం లేదా వ్యక్తిగత ద్వేషాల నేపథ్యంలో ఈ దుర్చశ్యకు పాల్పడ్డారా.. అన్నది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. జిల్లా రిజిస్ట్రార్ బదిలీ పోలీసులకు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన జిల్లా రిజిస్ట్రార్ విజయలక్ష్మికి పదోన్నతి రావడంతో ఫి ర్యాదు చేసిన మ రుసటి రోజే బదిలీ కావడం గమనార్హం. పేజీలు గల్లంతైన రికార్డుని ఆమె సీజ్ చేశారని కొవ్వూరు సబ్‌రిజిస్ట్రార్ ఎన్‌పీఎస్‌ఆర్ రాజు చెబుతున్నారు. ఇప్పటివరకూ గల్లంతైన నాలుగు పేజీల నంబర్లకు సంబంధించిన ఆస్తు ల వివరాలు కూడా పోలీసులకు అందలేదని తెలి సింది. ప్రస్తుతం పదోన్నతిపై వెళ్లిన జిల్లా రిజిస్ట్రార్ విజయలక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫోన్ నంబర్ స్విచాఫ్‌లో ఉంది. నూతనంగా జిల్లా రిజిస్ట్రార్‌గా మరో వ్యక్తి విధుల్లో చేరే వరకూ విచారణకు ఇబ్బందులు తప్పవని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఫిర్యాదుదారులే విచారణకు రావాల్సి ఉంటుం దన్నారు. దీంతో ఈ కేసు నీరుగారుతున్నట్టు స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా ఇక్కడ నుంచి ఆరుగురు సిబ్బందిని బదిలీ చేయగా వారి స్థానంలో విధుల్లో చేరేందుకు కొత్త సిబ్బంది సంకోచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కీలకమైన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 1998కి ముందు ఉన్న రికార్డులను అధికారులు తనిఖీ చేస్తున్నట్టు సమాచారం. -
దుమ్ము దులుపుతున్నారు
- రికార్డుల కంప్యూటరీకరణకు కలెక్టర్ ఆదేశం - పాత ఫైళ్లను బయటకు తీస్తున్న సిబ్బంది ప్రగతినగర్: పరిపాలన సౌలభ్యంలో బాగంగా పాత రికార్డులను కంప్యూటరీకరించాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా ఆదేశించిచడంతో ఆయా శాఖల సిబ్బంది పాత ఫైళ్ళను బయటకు తీసి దుమ్ము దులుపుతున్నారు. 2014 ఆగస్టు నుంచి మాత్రమే రికార్డులు ఆన్లైన్లో ఉన్నాయన్న విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లింది. అంతకు ముందు సంవత్సరాల ముఖ్యమైన రికార్డులను కూడా ఈ నెల 30వ తేదీ నాటికి కంప్యూటరీకరించి ఆన్లైన్లో పొందుపరచాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ శాఖలోని పాత ఫైళ్ళ కం ప్యూటరీకరణ పని ఇప్పటికే మొదలైంది. డీ ఆర్వో, ఆర్డీవో, తహశీల్దార్, లాండ్ అండ్ రెవన్యూ శాఖ రికార్డుల కంప్యూటీకరణ పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. రెవెన్యూలోని అన్ని సెక్షన్ల ఉద్యోగుల ముందు పాత ఫైళ్లు గుట్టలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. -
అధికారుల హైరానా..!
సాక్షి, కొత్తగూడెం: పంటనే నమ్ముకున్న అన్నదాత కడుపుకొట్టి.. వచ్చిన పరిహారం గోల్మాల్ చేసిన అధికారుల్లో హైరానా నెలకొంది. ఈ వ్యవహారంలో లోకాయుక్త సీరియస్‌గా స్పందించడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని సంబంధిత అధికారులకు వణుకు పుడుతోంది. పరిహారం నొక్కేసిన వైనంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తే అక్రమాలు వెలుగుచూడనున్నాయి. జిల్లాలో 2009 నుంచి 2012 వరకు జరిగిన పంట నష్టపరిహారం పంపిణీని ఇష్టారాజ్యంగా చేశారు. ఇందులో క్షేత్రస్థాయి అధికారుల పాత్ర ఎక్కువగా ఉంటే.. సంబంధిత ఉన్నతాధికారులు కూడా స్వాహా పర్వానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో యథేచ్ఛగా దండుకున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేసిన రూ.99 కోట్ల పరిహారంలో సుమారు రూ. 20 కోట్లు పక్కదారి పట్టినట్లు సమాచారం. అసలు పంట నష్టం అంచనాలోనే క్షేత్రస్థాయి సిబ్బంది తమ మాయాజాలన్ని ప్రదర్శించినట్లు తెలిసింది. ఎక్కువ సంఖ్యలో రైతులు పంట నష్టపోయినట్లు ప్రభుత్వానికి నివేదికలు పంపడంతో.. దానిపై మళ్లీ క్షేత్ర స్థాయిలో ఆయా అధికారులు పరిహారానికి ఎవరు అర్హులో అనేది విచారణ చేయించలేదు. దీంతో ప్రభుత్వానికి పంపిన తొలి విడత జాబితాలోనే ఎక్కువ మంది అనర్హులకు కూడా పరిహారం అందేలా చోటు దక్కింది. మండల స్థాయి అధికార పార్టీ నాయకులు సంబంధిత శాఖల సిబ్బందితో మిలాఖత్ అయి జాబితాలో అనర్హులకు స్థానం కల్పించేలా చక్రం తిప్పారు. అర్హులైన బాధిత రైతులకు ఈ జాబితాలో చోటు దక్కలేదు. దీనిపై వ్యవసాయ, రెవెన్యూ అధికారుల చుట్టూ వారు ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఆయా రైతులు లోకాయక్తను ఆశ్రయించడంతో అక్రమాలకు పాల్పడిన అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇష్టారాజ్యంగా పరిహారం.. ఖమ్మం రూరల్ మండలంలో ఈ పరిహారం పంపిణీ అడ్డగోలుగా చేసినట్లు బాధిత రైతులు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. పరిహారం పంపిణీలో జరిగిన అవకతవకలపై ఆధారాాలతో సహా లోకాయుక్తకు అందజేశారు. ఆదర్శ రైతుల కుటుంబాల్లో నాలుగు నుంచి ఐదుగురి వరకు పరిహారం చెక్కులు రావడం, ఒక గ్రామానికి చెందిన రైతులను మరో గ్రామంలోని జాబితాలో పెట్టడం వంటి రుజువులు చూపించారు. అలాగే ఇల్లెందు మండలానికి చెంది.. ఖమ్మం రూరల్ మండలంలోని బంధువుల ఇంట్లో ఉండి చదువుకుంటున్న 8వ తరగతి విద్యార్థి పేరు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక సర్వే నంబర్ పరిధిలో ఉన్న తరి భూమిలో పత్తి సాగు చేసినట్లు రికార్డుల్లో చూపించారు. అసలు ఈ భూమి వరిసాగుకు మాత్రమే అనుకూలం. ఇలా అనేక అవకతవకలకు పాల్పడ్డారు. ఖమ్మం రూరల్ మండలంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో పరిహార స్వాహా పర్వం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రూ. కోట్ల పరిహారం అనర్హులకు దక్కినట్లు సమాచారం. అర్హులైన రైతులకు కూడా పరిహారం పంపిణీ ప్రహసనంగా జరగడంతో అక్రమాలకు పాల్పడే అవకాశం ఆయా సిబ్బంది, అధికారులకు కలిసివచ్చిందనే ఆరోపణలున్నాయి. రికార్డులను తారుమారు చేసే యత్నం.. బాధిత రైతులు లోకాయుక్తను ఆశ్రయించగా, దీనిపై విచారణ జరపాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ఇలా పరిహారం గోల్‌మాల్‌పై ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘ఇన్‌ఫుట్ సబ్సిడీ.. ఔట్’ శీర్షికన కథనం వెలువడడంతో అధికారులు ఉరుకులు.. పరుగులు పెడుతున్నా రు. గతంలో ఎంత మందికి పరిహారం పంపిణీ అయింది, అనర్హులు ఎవరికి ఇచ్చాం.. అన్న కోణంలో రికార్డులను చూసుకుంటున్నట్లు సమాచారం. లోకాయుక్త సీరియస్‌గా స్పందించడంతో ఈ వ్యవహారంలో పూర్తి స్థాయిలో విచారణ జరిగి ఉద్యోగానికి ఎసరు పడుతుందన్న భయంతో రికార్డులను తారుమారు చేసే యత్నంలో ఉన్నట్లు తెలిసింది. అంతేకాకుండా కొంతమంది అధికారులు.. లోకాయుక్తను ఆశ్రయించిన రైతుతో కూడా ఈవ్యవహారంపై చర్చించి.. ‘తమ ఉద్యోగాలు పోగొడతారా..?’ అని ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికారుల వణుకుతో తీగలాగితే జిల్లా వ్యాప్తంగా పంట పరిహారం స్వాహా పర్వం డొంక కదిలే అవకాశం ఉంది.