విద్యాభివృద్ధికి కృషి చేస్తా | committed for education development | Sakshi
Sakshi News home page

విద్యాభివృద్ధికి కృషి చేస్తా

Sep 17 2014 1:50 AM | Updated on Jul 11 2019 5:01 PM

విద్యాభివృద్ధికి కృషి చేస్తా - Sakshi

విద్యాభివృద్ధికి కృషి చేస్తా

విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి హామీ ఇచ్చారు. రేగొండ మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ హైస్కూల్‌లో అదనపు గదుల నిర్మాణానికి రాజీవ్ విద్యామిషన్ నుంచి రూ.35 లక్షలు మంజూరయ్యూరుు

రేగొండ : విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి హామీ ఇచ్చారు. రేగొండ మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ హైస్కూల్‌లో అదనపు గదుల నిర్మాణానికి రాజీవ్ విద్యామిషన్ నుంచి రూ.35 లక్షలు మంజూరయ్యూరుు. ఈ మేరకు గదుల నిర్మాణానికి మంగళవారం స్పీకర్ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తామన్నారు. నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందించే దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.
 
తెలంగాణ పునర్నిర్మాణంలో భాగాంగా నాగరికతకు దూరంగా ఉన్న చెంచుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని చెప్పారు. చెంచు విద్యార్థులు ఆంగ్ల భాష ఉచ్చరించేలా కమ్యూనికేట్ విద్యనందించేందుకు నిపుణులతో చర్చిస్తున్నామన్నారు. గవర్నర్, సీఎంతో చెంచు విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడే విధంగా ఆరు నెలల్లో వారిని తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ గేయూన్ని స్పీకర్ ఆలపించి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. కార్యక్రమంలో స్ధానిక సర్పంచ్ మోడెం ఆదిలక్ష్మి, ఎంపీపీ ఈర్ల సదానందం, ఎంపీటీసీ సభ్యుడు పట్టెం శంకర్, ఎంఈఓ కె.రఘుపతి, పాఠశాల ఇన్‌చార్జ్ హెచ్‌ఎం వి.హేమ, ఎస్‌ఎంఎస్ చైర్మన్ కిషన్, కుంచాల సదావిజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement