అవినీతికి పాల్పడితే కఠినచర్యలు | Commit to action against corruption | Sakshi
Sakshi News home page

అవినీతికి పాల్పడితే కఠినచర్యలు

Jun 1 2016 1:08 AM | Updated on Sep 22 2018 8:22 PM

సాదా బైనామాల భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో రెవెన్యూ సిబ్బంది అవినీతికి పాల్పడితే కఠినచర్యలు తప్పవని ...

భూపాలపల్లి తహసీల్దార్ సత్యనారాయణ

 

భూపాలపల్లి: సాదా బైనామాల భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో రెవెన్యూ సిబ్బంది అవినీతికి పాల్పడితే కఠినచర్యలు తప్పవని భూపాలపల్లి తహసీల్దార్ సత్యనారాయణ హెచ్చరించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో సాదా బైనామాల రిజిస్ట్రేషన్లపై వీఆర్‌ఓలు, సర్పంచ్‌లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. లావాణి, పోడు భూములు, ప్రభుత్వ భూమి కబ్జా చేసిన వారికి ఈ పథకం వర్తించదన్నారు.

2014 జూన్ 2లోపు ఇతరుల నుంచి కొనుగోలు చేసిన భూములను మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తామని, అంతేకాక ఒక కుటుంబానికి ఐదెకరాల లోపు మాత్రమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. జూన్ 2 నుంచి 10వ తేదీ వర కు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. సమావేశంలో ఎంపీపీ కళ్ళెపు రఘుపతిరావు, జెడ్పీటీసీ సభ్యురాలు జర్పుల మీరాబాయి, ఆర్‌ఐ రహమాన్, పలు గ్రామాల సర్పంచ్‌లు, వీఆర్‌ఓలు పాల్గొన్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement