పోలింగ్‌ రోజున ఇవి పాటించాలి..

 Collector Rajat Kumar Saini Giving Suggestion To Voters - Sakshi

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ శైనీ సూచనలు 

సాక్షి, కొత్తగూడెం: పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ రోజున ఓటు హక్కు వినియోగించుకునే జిల్లా ఓటర్లకు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 

  • స్త్రీ, పురుషులు వేర్వేరుగా క్యూలైన్‌ పాటించి పోలీసు శాఖ వారికి సహకరించాలి. పోలింగ్‌ స్టేషన్‌కు వచ్చే ఓటర్లు సెల్‌ఫోన్‌ తీసుకు రావొద్దు. మద్యం సేవించి ఓటు వేయడానికి రాకూడదు. పోలింగ్‌ కేంద్రానికి ఎలాంటి మారణాయుధాలు, వాటర్‌ బాటిళ్లు, ఇంక్‌ బాటిళ్లు తీసుకురావొద్దు. 
  • రాజకీయ పార్టీలకు చెందిన స్టిక్కర్లు, టోపీలు, కండువాలు, జెండాలు తదితర వాటితో పోలింగ్‌ కేంద్రానికి రావొద్దు.  
  • ఓటర్‌ కార్డుపై ఓటరు వివరాలు అన్నీ సరిగ్గా ఉంటే ఓటర్‌ ఐడీ కార్డుతో ఓటు వేయవచ్చు. లేదంటే ఇతర గుర్తింపు కార్డుల్లో కొన్ని చూయించాలి.  
  • పోలింగ్‌ కేంద్రం నుంచి 100 మీటర్లు మార్కు చేయబడిన లైనులోపల మాత్రమే ఓటర్లకు ప్రవేశం.   ఓటు వేసిన వెంటనే తిరిగి పోలింగ్‌ కేంద్రం విడిచి వెళ్లిపోయి మరొక ఓటరుకు అవకాశం ఇవ్వాలి.  
  • పోలింగ్‌ కేంద్రం నుంచి 200 మీటర్లు అవతల ఓటు వేయడానికి వచ్చిన వారి వాహనాలను పార్క్‌ చేయాలి. పోలింగ్‌ కేంద్రం నుంచి 200 మీటర్ల అవతల మాత్రమే రాజకీయ పార్టీ వారు నీడనిచ్చే లాంటివి ఏర్పాటు చేసుకుని ఒక చిన్న టేబుల్, రెండు కుర్చీలతోపాటు  ఇద్దరు మాత్రమే ఉండాలి. పార్టీ జెండాలు కానీ, గుర్తులు కానీ బ్యానర్లుగాని ప్రదర్శించకూడదు. ఏ పార్టీ వారు కూడా ఎటువంటి టెంట్లను ఏర్పాటు చేయకూడదు.  
  • టిఫిన్లు, భోజనాలు తదితరవి ఓటర్లకు సరఫరా చేయరాదు. ఓటర్‌ స్లిప్పులు ఇచ్చేవారు ఎటువంటి పార్టీ గుర్తులు లేకుండా తెల్లని కాగితంలో ముద్రించనవి మాత్రమే ఇవ్వాలి. అభ్యర్థి పేర్లు మొదలైనవి కలిగిన వాటిపై ఇవ్వకూడదు.   
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top