
సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం యాదాద్రిలో పర్యటిస్తున్నారు. లక్ష్మీనర్సింహస్వామి ఆలయ పరిసరాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి.. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కేసీఆర్ యాదాద్రిని సందర్శించటం ఇదే తొలిసారి.
14 నెలల తరువాత ఆయన యాదాద్రి వచ్చారు. యాదాద్రిలో ప్రధానాలయ నిర్మాణపనులు చురుగ్గా సాగుతున్నాయి. ముఖమండపం ఇప్పటికే సిద్ధమయింది. ఇంకా మిగిలిన ప్రధానాలయం నిర్మాణపనులపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. గుట్టపై మౌలిక వసతుల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలను కేసీఆర్ సమీక్షిస్తారు. ఆలయానికి అనుబంధంగా ఉండే క్యూకాంప్లెక్స్‌లు, వసతి గృహాల నిర్మాణాలు, మంచినీటి సరఫరా, సుందరీకరణ తదితర పనులపై అధికారులకు సూచనలు చేయనున్నారు.