ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కేసీఆర్‌ భేటీ | CM KCR Meeting With Job, Teacher unions in Pragathi Bhavan | Sakshi
Sakshi News home page

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కేసీఆర్‌ భేటీ

May 16 2018 12:40 PM | Updated on Sep 4 2018 5:44 PM

CM KCR Meeting With Job, Teacher unions in Pragathi Bhavan - Sakshi

సీఎం చంద్రశేఖర్‌ రావు

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్య మంత్రి కె. చంద్రశేఖర్‌ రావు నేడు మధ్యాహ్నం 03 గంటలకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ప్రగతిభవన్‌లో భేటి కానున్నారు. ఈ సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం నివేధికలపై సంఘాలతో చర్చించనున్నారు. అంతేకాక ఆర్టీసీ ఉద్యోగులతో కూడా చర్చించి వారి డిమాండ్లతో రిపోర్టు ఇవ్వాలని గతవారంలో సీఎం కెబినెట్‌ సబ్‌ కమిటీని ఆదేశించిన విషయం తెలిసిందే. 

గత ఆదివారం ఆర్టీసీ కార్మికులతో చర్చించి సీఎంకు ఉపసంఘం రిపోర్టు అందించింది. మంగళవారం ఆర్టీసీ డిమాండ్లపై సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. అప్పులో ఉన్నా.. ఇతర రాష్ట్రాలకంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నామని సీఎం అన్నారు. అంతేకాక గతంలో 44% ఫిట్మెంట్‌ కూడా ఇచ్చామని తెలిపారు.  సంస్థను కాపాడేందుకు ప్రభుత్వం సహకరిస్తున్న గొంతెమ్మ కోరికలు కోరుతారా అంటూ కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. నేడు ప్రగతిభవన్‌లో జరుగుతున్న మీటింగ్‌కు ఆర్టీసీ కార్మికులు అవసరం లేదని సీఎం అన్నారు. సచివాలయంలో ఆర్టీసీ కార్మికులతో కెబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం కొనసాగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement