గాంధీ, మండేలాల తర్వాత కేసీఆర్ ఒక్కడే.. | CM kcr following nonviolence root of gandhi and mandela | Sakshi
Sakshi News home page

గాంధీ, మండేలాల తర్వాత కేసీఆర్ ఒక్కడే..

Feb 17 2015 2:02 PM | Updated on Aug 14 2018 10:51 AM

కేంద్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరుతుందని వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలేనని తెలంగాణ విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరుతుందని వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలేనని తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకూ అలాంటి ఆలోచనే లేదని.. ఈ అంశంపై బీజేపీ ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు కూడా జరపలేదని మంత్రి స్పష్టం చేశారు.

 

గాంధీ, నెల్సన్ మండేలా తర్వాత అహింసా మార్గంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించిన వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఒక్కరేనని పేర్కొన్నారు. రాష్ట్రాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై కూడా ఉందని మంత్రి అన్నారు.  ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే ఉద్యమం కేసీఆర్ చేశారని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement